శిప్ర వాక్యం

బహుజన నేతల్లో సిద్ధాంత రాహిత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసృష్టిలో నిప్పు కనిపెట్టిన క్షణం ఒక దివ్య ముహూర్తం. చక్రం కనిపెట్టిన క్షణం చిరస్మరణీయం. ఇవాళ విద్యుత్తు మీద విద్వత్తు ఆధారపడి వుంది. కంప్యూటర్, ఇంటర్నెట్, యూ ట్యూబ్, సెల్‌ఫోన్- ఇవన్నీ మానవ మేధ చేసిన మహావిష్కరణలు. ఆ మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్సు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న షెపర్డ్ కంచె ఐలయ్య ‘వార్తల్లో వ్యక్తి’ అయినాడు. ఈయన హరప్పాలో బట్టల సబ్బు కనిపెట్టిన క్షణం మానవ చరిత్రను మలుపు తిప్పిందని అన్నాడు. నిజమే కావచ్చు- డప్పు, చెప్పులు ప్రాథమిక సూత్రాలు అని కూడా ఆయన అన్నాడు. దానికి మనం అంగీకరిద్దాం!
ఏ దేశంలోనైనా ఉత్పత్తి వర్గాలు ముఖ్యమైనవి. వీటిమీద మానవాళి మనుగడ ఆధారపడి వుంది. కాదనగలమా? గొర్రెలను, బర్రెలను పెంచి మాంసోత్పత్తి చేయటం, నారు నీరు పోసి పంటలు పండించటం, కమ్మరం, కుమ్మరం, చాకలి, మంగలి, జాలరి, మేదరి ఇత్యాదులన్నీ ఉత్పత్తి కులాలు. వీటిని మనం గౌరవించాలి. ఎందుకంటే వీటిమీదనే మానవుని అస్తిత్వం వుంది. ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా ఈ కులాలన్నీ పాలుపంచుకోవలసిందే! ఈ కులాలకు ‘బహుజన’ వర్గాలు అని నామకరణం చేశారు. కారల్ మార్క్స్, ఎంగిల్స్ మీద ఆధారపడిన కమ్యూనిజం- గని కార్మికులు, పత్తి రైతుల శ్రేయస్సు మీద ఒక సిద్ధాంతాన్ని నిర్వచించింది. దీనికి ‘కమ్యూనిజం’ అని పేరు పెట్టారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వంటి వారు రంగు భేదాన్ని, జాతి (రేస్) కుల (కాస్ట్) భేదాన్ని వ్యతిరేకించారు.
ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం కాబట్టి ఎక్కువ శాతం ఓట్లు ఏయే సామాజిక వర్గాలకు ఉన్నాయో వారిని సంతృప్తి పరచడానికి పాలకులు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సిద్ధాంతాలు పూర్తిగా మరచిపోయిన ఇంకొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి ప్రేమ- త్యాగం- దయ -కరుణ- విశ్వమానవ దృక్పథం- సృష్టిలో వివిధ అంశాల మధ్య సంతులనం- తపస్సు- ఇలాంటి వౌలికాంశాల గురించి మార్క్స్ ఆలోచించలేదు. మన బహుజన నాయకులూ ఆలోచించటం లేదు.
కంచె ఐలయ్య- ‘బ్రాహ్మణుడు సోమరిపోతు.. ఆధ్యాత్మిక ఫా సిస్టు’ అని విద్వేషం వెళ్లగక్కాడు. మరి ఈ ఫాసిజం పోప్ జాన్‌పాల్‌కు, అబ్దుల్లా బుఖారీకి వర్తించదా? పోప్ జాన్‌పాల్ పొలం దున్నిండా? డప్పు కొట్టిండా? ఐనా ఆయన ఆధ్యాత్మిక గురువు. ఐలయ్య హిందూ మతం నుండి పోప్ నేతృత్వంలోని క్రైస్తవ మతంలో చేరిపోయాడు. అక్కడి బిషప్‌లను, ప్రజల సేవలో తరించిన వారిని- ‘మీరు చెప్పులు కుట్టారా? డప్పులు కొట్టారా? నాట్లు వేశారా?’ ఐ లయ్య ఎందుకు అడగటం లేదు. ఈయన సిద్ధాంతం ప్రకారం వారంతా ఆధ్యాత్మిక ఫాసిస్టులే కావాలి. ‘నల్ల రంగు’ ఐలయ్య వంద జన్మలెత్తినా శే్వతజాతీయులు వాటికన్‌కు పోప్‌గా అంగీకరించరు.
ఇక రచనల విషయానికి వచ్చినపుడు- భాష, భావం, ఆచరణ అనేవి అత్యంత కీలకాంశాలు. శాస్ర్తియ ఆధారాలు చెప్పినపుడు శ్రీశ్రీలు, ఐలయ్యలు సంయమనం పాటించరు. గూండాలు - రౌడీలు- స్మగ్లర్లు- పందులు - ఇలాంటి దిగజారుడు భాష వాడతారు. ఇందులో ద్వేషం ఉంది, విధ్వంసం ఉంది, హింస ఉంది. వెర్బల్ టెర్రరిజం ఉంది. అందువల్లనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు యుగం అంతరించింది.
ఇక భావం రెండవ అంశం. హింసను ప్రేరేపించడం ద్వారా ఆదర్శ సమాజం అసాధ్యం. సైద్ధాంతికంగా ఐలయ్యలూ, మాయావతులూ ప్రతిపాదించిన ‘లాల్ -నీల్’ వర్గాల అభ్యున్నతి జిహాదీ ఉగ్రవాద శక్తులతో ఎందుకు రాజీపడిందో- ఆ సిద్ధాంత కర్తలు చెప్పలేకపోతున్నారు.
మూడవ అంశం ఆచరణ. ఇది మరీ దౌర్భాగ్యంగా ఉంది. తాగుడు, వాగుడు నిరంతర వ్యసన పరాయణత్వం. ఆత్మస్తుతి పరనింద స్వార్థం, జుగుప్సావహ జీవనం- కమ్యూనిస్టు కవులందరికీ ఇవి సాధారణ లక్షణాలు. ఇందుకు ఎలాంటి మినహాయింపులేదు.
సిద్ధాంతం- భాష- ఆచరణ- ఈ మూడు ప్రధానాంశాలల్లో ఈ వర్గాలు వైఫల్యం చెందాయి. చెప్పినదానికి, చేస్తున్నదానికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. కార్పొరేట్ పత్రికలకు అమ్ముడుపోయిన వారు, సినీ వినీలాకాశంలో షాంపైన్ చప్పరిస్తూ పేదవాళ్లపై మొసలి కన్నీరు కార్చేవారు, సిల్కు చొక్కా వేసుకొని హైదరాబాద్ ఆబిడ్స్‌లో జువెలరీ షాపింగ్‌కు వెళ్లినవారూ- వీరంతా ‘అభ్యుదయ’ కవులేనని నమ్మాలి. ఎన్ని పైరవీలు చేస్తే జాతీయ పురస్కారాలు కొందరిని వరించాయో మనకు తెలియనిదా?
ఈ అంశాలు అలా ఉంచితే ‘పోస్ట్ హిందూ ఇండియా’ అంటే ఏమిటి? భారతదేశంలో హిందూ మతం నశించిపోయిందని అర్థం. మొదట వైదిక యుగం తర్వాత బౌద్ధయుగం ఆపైన ఇస్లామిక్ యుగం తర్వాత బ్రిటీషు యుగం- అని భారతదేశ చరిత్రను యుగ విభజన చేయవచ్చు. మరి 2014 నుండి మోదీ యుగం ప్రారంభమయింది. అంటే ఇది హిందూ యుగం. కమ్యూనిజం దేశంలో ఇంచుమించు అంతరించింది.
మాయావతి, ఐలయ్యలను చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఉత్పత్తి- డప్పు- చెప్పు వంటి పడికట్టు పదాలతో జనాలను మోసం చేయలేరు. మాయావతి పొలం దున్నిందా? మీరాకుమార్ నాట్లు వేసిందా? అంతా విమానాల్లో తిరిగేవారే అయినప్పుడు- ‘ఇంగ్లీషు నేర్చుకోని బ్రాహ్మణులు ఐఎఎస్ ఆఫీసర్లుగా మారారు.. విమానాల్లో తిరుగుతున్నారు..’ అంటూ ఆరోపణలు ఎందుకు? విమానాలల్లో తిరిగే వర్గాలు ఏవి? సోనియమ్మలు, షబానా అజ్మీలు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ వర్గాలకు చెందిన వారు కాదు.
పూర్వం వైశ్యులు పశుపోషణ చేసేవారు. నేటికీ గ్రామీణ వ్యవసాయం గమనించండి. బ్రాహ్మణులు కూడా పంటలు పండించుకొని ఆవులను పెంచుకుంటున్నారు. పడవలలో సరుకు లెక్కించి ప్రపంచ వ్యాప్తంగా వస్తువులతోబాటు మన సంస్కృతిని ఆచార వ్యవహారాలను వైశ్యులు వివిధ దేశాలకు తీసుకునిపోయారు. ఇది చారిత్రక సత్యం! మానవ శరీరంలో తల-మొండెం- చేతులు-కాళ్లు ఉన్నాయి. ఈ నాలుగు కలిస్తేనే దేహం సర్వాంగీణం అంటారు! సమాజమూ అంతే!!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668