శిప్ర వాక్యం

ఎన్నికల రణంలో ‘మైనారిటీ’ అస్త్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను గోమాంసం తింటే తప్పేమిటి?’ అని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఇదివరకే ప్రశ్నించాడు. లక్షలాది హిందువులను చంపటమో, మతం మార్చటమో చేసిన హైదరాలీ కొడుకు జయంత్యుత్సవాలను ఈ ముఖ్యమంత్రి పోలీసు రక్షణతో బలవంతంగా జరిపించాడు. తమిళనాడుకు నదీ జలాలు పోకుండా కృష్ణరాజసాగర్ వద్ద రైతులు కృష్ణానదీ ప్రవాహాన్ని ఆపివేశారు. ఆంధ్రుల నోట్లో మట్టికొట్టి ‘అల్మట్టి’ డ్యామ్ ఎత్తుపెంచారు. ‘శివలింగాలపై మూత్రం పోయండ’ని రెచ్చగొట్టిన కలబురిగి అనే వ్యక్తిని వైస్ చాన్సలర్ చేసిన సిద్ధరామయ్య ఇప్పుడు లింగాయతులు హిందువులు కారంటూ తీర్మానించాడు. ప్రాంతీయ దురభిమానాన్ని రెచ్చగొడుతూ కర్నాటకు ప్రత్యేకంగా ఓ జెండాను రూపొందించాడు. భారత్‌లో కర్నాటక అంతర్భాగం కాదా? ‘్భరత్ మాతాకీ జై’ అన్న కొందరిని సిద్ధరామయ్య ప్రభుత్వం కాల్చి చంపింది.
కర్నాటకలో ‘లింగాయతులు’ వేరే మతస్థులా? మన దేశంలో క్రైస్తవులు, ముస్లిములు మాత్రమే అన్య మతస్థులు. లింగాయతులకు దేవుడు ఎవరు? వీరి కులదైవం పేరు వీరభద్రుడు. వీరి పరమదైవం పేరు శంకరుడు. పార్వతి, కుమారస్వామి,గణేశుడు, నందీశ్వరుడు లింగాయతుల దేవతలు. వీరి ఆరాధనా స్థలం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం. లింగాయతులలో రెండు ప్రధాన వర్గాలున్నాయి. అవి..1. పంచాచార్యులను గౌరవించే సంప్రదాయ వర్గం. వీరు వేదాలను గౌరవిస్తారు. 2. బసవేశ్వరుణ్ణి దేవునిగా భావించే మరొక వర్గం- వీరు బసవ వచనాలనే ప్రమాణంగా స్వీకరిస్తారు, వర్ణవ్యవస్థను అంగీరించరు. ఇటీవలి కాలంలో బసవభక్తులు కొందరు లింగపూజ మానివేశారు. బసవన్న, బుద్ధుడు, అంబేద్కర్ తమకు పూజనీయులని, బ్రాహ్మణ మతం తమకు ఆమోదం కాదని వీరు బహిరంగంగానే వాదిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం లింగాయతులది వేరే ‘మైనారిటీ మతం’ అని సిద్ధరామయ్య ప్రకటించాడు.
కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూచిన వారికి ఇందులో కొత్త ఏమీ కన్పడదు. లోగడ జైనులను మైనారిటీ మతస్థులు అన్నారు. బౌద్ధులను మైనారిటీ వర్గం అన్నారు. సిక్కులు, ముస్లిములు, క్రైస్తవులు, పార్సీలు.. ఇప్పుడు లింగాయతులు మైనారిటీ వర్గం అన్నారు. ఇలా హిందూ ప్రధాన జీవన స్రవంతి నుండి చాలా వర్గాలను కాంగ్రెస్ పాలకులు దూరం చేశారు. ‘విభజించి పాలించు’ అని డొప్లే అనే విదేశీయుడు చెప్పిన విషయాన్ని మన రాజకీయవేత్తలు బాగా జీర్ణించుకున్నారు. 1947లో దేశ విభజన జరిగినపుడు, ఆ తర్వాత పలు రాష్ట్రాలను విభజించినపుడు రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పాలకులు నిర్ణయాలు తీసుకున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా కాం గ్రెస్ వారు దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించారు. ఇప్పుడు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్ వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు వారిని ప్రత్యేక మైనారిటీ మతస్థులుగా ప్రకటించారు. హైదరాబాద్‌లో మజ్లిస్ పార్టీతో గతంలో కాంగ్రెస్, ఇప్పుడు తెరాస నేతలు పొత్తులు పెట్టుకున్నారు. ముస్లిములకు మత ప్రాతిపదికపై రిజర్వేషన్లు ఇవ్వాలని ఒకప్పుడు కాంగ్రెస్, ఈనాడు తెరాస నిర్ణయించాయి.
సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవీకరణ పూర్తిగా జరిగిపోయింది. ఇతర ప్రాంతాల్లోనూ ఇదే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో ఒకప్పుడు ఒక్క శాతం దాటని క్రైస్తవుల సంఖ్య ఇటీవల 12 శాతానికి పెరిగింది. అక్కడి అగ్రవర్ణ కుటుంబాలు న్యూజెర్సీ, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలకు భారీగా వలసపోయాయి. జెరూసలెంకు వెళ్లే క్రైస్తవ యాత్రికులకు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చింది. కానీ, ఈ దేశంలో మెజారిటీ మతస్థులైన హిందువులు అమరనాథ్ యాత్రకు వెళితే జీహాదీ ఉగ్రవాదులు కాల్చి చంపుతున్నా పాలకులు పట్టించుకోరు. హిందువులు మానస సరోవరానికి వెళ్లాలంటే చైనా నుండి వీసా తీసుకోవాలి. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమే. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో మార్పు లేదు.
కర్నాటక జనాభాలో లింగాయతులు 17 శాతం ఉన్నారు. వీరు వందకు పైబడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేయగలరు. ఈ కారణంగానే సిద్ధరామయ్య ‘మతం కార్డు’ను ప్రయోగించాడు. అయితే, లింగాయతులు కాని 83 శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌కు దూరమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ని ర్ణయం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ అని మరొక అంచనా. సిద్దరామయ్య ఒక నిస్పృహలో ఉండి ఈ రాజకీయ జూదానికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ పార్టీనే కాదు, తన అస్తిత్వాన్ని కూడా రాజకీయంగా కాపాడుకోవాలని ఆయన చేసిన ప్రయత్నం ఇది. ‘మతతత్వ భాజపాను ఓడించండి’ అంటూ గతంలో గొప్పగా నినాదాలు ఇచ్చిన సోనియా గాంధీ, సీతారాం ఏచూరి, బృం దాకారత్‌లు సిద్దరామయ్య చర్యలను ఎందుకు ఖండించడం లేదు? ‘లింగాయతులు మైనారిటీలు’ అని సిద్ధరామయ్య ప్రకటించడం కోర్టులో నిలుస్తుందా? తెలంగాణలో ముస్లిములకు మత ప్రాతిపదికపై 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం రాజ్యాంగ విరద్ధం అని తేల్చారు. ఇదీ అంతే! రాజ్యాంగం ఒప్పకోకపోయినా సిద్దరామయ్య ఈ ‘రాజకీయ జూదం’ ఎందుకు ఆడుతున్నాడో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. ‘నేను మైనారిటీ స్టేటస్ ఇచ్చినా న్యాయస్థానాలు అడ్డుకుంటున్నాయి’ అంటూ ఆయన ఆత్మరక్షణ చేసుకోవచ్చు.
తమిళనాడులో ద్రవిడ భాషోన్మాదం తారస్థాయికి చేరాక కర్నాటకలోనూ రాజకీయ లబ్ధికోసం భాషా రాజకీయాలు మొదలుపెట్టారు. నిజానికి కన్నడం వేరే భాష కాదు. 10వ శతాబ్దం వరకూ తెలుగు, కన్నడ భాషలకు ఏకలిపి ఉండేది. తర్వాతి కాలంలో కన్నడ వేర్పాటు వాదాన్ని రాజకీయ నాయకులు పెంచి పోషించారు. శాకాహారులు, శాంత స్వభావులు అయిన లింగాయతులను కొందరు రెచ్చగొట్టి ఉద్యమకారుల వలె మార్చారు. తమిళనాడులో వలె ఇప్పుడు కర్నాటకలో వేదం చదివే వారికి ఆదరణ లేదు. కాగా, ఇటీవల లింగా నందస్వామి అనే లింగాయత గురువుకన్నడ సంప్రదాయ వీరశైవ గురువులైన పంచాచార్యులపై యుద్ధం ప్రకటించాడు. అఖిల భారత వీరశైవ మహాసభ ఇటీవల బెంగళూరులో సమావేశమై సిద్ధరామయ్య ఎత్తుగడలను ఖండిస్తూ ఒక తీర్మానం ఆమోదించింది. కేవలం రాజకీయ లబ్ధికోసం దేశంలో కాంగ్రెస్ అనేకసార్లు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించి, దేశానికి అపారమైన నష్టాన్ని చేకూర్చింది. సరిగ్గా ఇవాళ సిద్దరామయ్య- లోగడ పంజాబ్‌లో భింద్రేన్‌వాలా పోషించిన పాత్రనే పోషిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించిన ఫలితంగా కాంగ్రెస్ పార్టీ 2014లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. ‘్భరత దేశాన్ని ముక్కలు చేయండి’ అని పిలుపుఇచ్చిన సిపిఎం మద్దతుతో సోనియాగాంధీ నేతృత్వంలో యుపిఏ-2 పరిపాలన సాగింది. ఇవన్నీ విచ్ఛిన్నకర రాజకీయాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. కర్ణాటకలో సిద్దరామయ్య వికృత చర్యల వెనుక ఘనమైన చరిత్ర ఉంది. ఎన్నికలలో గెలుపుకోసం ఇలాంటి నేతలు ఏ గడ్డి అయినా తింటారు. వోటుబ్యాంకు రాజకీయాలతో మతోన్మాద పార్టీలతోనూ జత కడతారు. నరేంద్ర మోదీ దేవుడేం కాదు, అతడూ మనలాంటి మనిషే. కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల దేశద్రోహ చర్యలకు ప్రజలు విసుగెత్తి పోయి మోదీ పట్ల ఆకర్షితులైనారు. దేశవ్యాప్తంగా భాజపా బలపడటం వెనుక ఉన్న రహస్యం ఇదే! కర్నాటకలో ఇప్పటికి మూడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రైతులను పట్టించుకోని సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పుడు మత రాజకీయాలకు దిగింది. లింగాయత్ నాయకుడు బిజెపి బి.ఎస్.యడ్యూరప్పను ముఖ్యమంత్రిని కాకుండా చేయడానికి సిద్దరామయ్య ఈ వ్యూహం పన్నాడు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668