శిప్ర వాక్యం

నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి అక్కడ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రముఖ బిజెపి నాయకుడు షానవాజ్ హుస్సేన్ మొన్న ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘2024 వరకు ప్రధాని పదవి ఖాళీలేదు’అని ప్రకటించారు. అంటే నరేంద్రమోడీకి రాహుల్‌గాంధీ ప్రత్యామ్నాయం కాదు- అని అర్ధం. ఈ వాక్యాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. ప్రస్తుతం 2014-2019 సంవత్సరాల మధ్యకాలంలో భారత ప్రధానిగా శ్రీ నరేంద్రమోడీ ఉన్నారు. 2019-2024 మధ్య కాలంలో కూడా వారే భారత ప్రధాని అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ వాక్యానికి అర్ధం. అందుకుగల కారణాలేమిటి? భారత ప్రధాని పదవి అలంకరించాలనే కోరిక చాలా మందిలో ఉంది. ముందుగా రాహుల్‌గాంధీ సంగతి చూద్దాం. ఈయన శ్రీమతి ఇందిరాగాంధీకి మనుమడు. జవహర్‌లాల్ వంశంలో జన్మించినవాడు. నెహ్రూ కుటుంబం భారతదేశాన్ని దాదాపు ఆరు దశాబ్దాలు అనువంశికంగా పరిపాలించింది. నెహ్రూ మరణానంతరం కొద్దికాలం లాల్‌బహదూర్‌శాస్ర్తీ ప్రధాని అయినప్పటికీ మళ్లీ నాయకత్వం నెహ్రూ కుటుంబం చేతిలోకి వెళ్లింది. దక్షిణాదికి చెందిన దేవెగౌడ, పి.వి.నరసింహారావు పాలనా కాలం మినహాయిస్తే మళ్లీ సోనియాగాంధీయే అధికారంలోకి వచ్చింది. ఆమె అసలుపేరు ఆంటోనియోమైనో. ఈమె ఇటలీ దేశస్థురాలు. ముస్సొలినీవద్ద సైనికునిగా పనిచేసిన ఒక ఫాసిస్టు కుమార్తె. ఈమెను రాజీవ్‌గాంధీ వివాహం చేసుకోవటం ద్వారా ఇండియా వచ్చింది. ఆమె సిస్టర్ నివేదిత అనిబిసెంట్ ఫ్లారెన్స్, నైటింగేల్, మదర్‌థెరీసాల వలె సేవాకార్యక్రమాలకోసం రాలేదు. విక్టోరియా రాణివలె భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చింది. మన్మోహన్‌సింగ్ అనే ఒక పెద్దమనిషిని నామమాత్ర ప్రధానిని చేసి తానే దేశాన్ని పాలించింది. ప్రధానమంత్రి కార్యాలయానికి కాకుండా ఫైల్స్ నేరుగా ఆమె ఉండే 10 జనపథ్‌కే వెళ్తుండేవి. ఇది రాజ్యాంగ విరుద్ధం. అంటే మన్మోహన్‌సింగ్ పాలనాకాలంలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు రాజ్యాంగేతర శక్తులుగానే రాజ్యపాలన చేశారు. దీనిని కాంగ్రెసు ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆమోదించాయి. 2014లో అనూహ్యంగా బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టింది. దీనిని నిరోధించటంకోసం చైనా పాకిస్తాన్ అమెరికాలు సమస్త ప్రయత్నాలు చేశాయి. ఐనా అప్పటికే సంఘపరివార్ బలపడటంతో ఈ విదేశీశక్తుల కుట్రలు ఫలించలేదు. భారతదేశానికి ప్రధాని కావాలనే కోరిక చాలా మందిలో వుంది. ములాయంసింగ్ యాదవ్, లల్లూప్రసాద్‌యాదవ్, మమతాబెనర్జీ, నితీశ్‌కుమార్, మాయావతి, శరత్‌పవార్, అజిత్‌సింగ్, జ్యోతిబాసు, ప్రకాశ్‌కారత్, చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నవీన్‌పట్నాయక్, దిగ్విజయ్‌సింగ్, భరత్‌సింగ్, సోలంకీ వంటి వారెందరో ఉవ్విళ్ళూరుతున్నారు. ఐతే ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అన్నట్లు భరత్‌సింగ్ సోలంకీ, అజిత్‌సింగ్, ములాయంసింగ్, శరత్‌పవార్ వంటివారు స్వీయ రాష్ట్రాలల్లోనే అధికారం కోల్పోయినప్పుడు దేశ ప్రధాని ఎలా కాగలరు??
ఇక రాహుల్‌బాబు కాంగ్రెసు ఒక్క పంజాబులో మాత్రమే అధికారంలో ఉంది. మూడువందల మంది ఎంపీల బలం లేనివారు భారత ప్రధాని కాజాలరు. అది రాహుల్‌గాంధీకి రావటం అసంభవం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద రాష్ట్రంలో ఈసారి అమేధీ, రాయబరేలీలలో కూడా కాంగ్రెసుకు ఓటువేసేవారు లేరు. అక్కడ నాలుగైదు పార్లమెంటు సీట్లుకూడా కాంగ్రెసు గెలుచుకోలేదు. ఒకనాడు ఏకచ్ఛత్రాధిపత్యంలో వెలిగిన పార్టీకి యుపిలో ఈ దుస్థితి ఎందుకు పట్టింది? కాంగ్రెసు మొదటినుండి ముస్లిం- క్రైస్తవుల ఓటు బ్యాంకులమీద ఆధారపడి ఉండేది. ఈ రెండు ప్రధాన వర్గాలను ములాయంసింగ్ యాదవ్ మాయావతులు చీల్చివేశారు. ఇక హిందూ ఓటు బ్యాంక్ బిజెపి వెంట ఉంది. ఇక రాహుల్‌గాంధీ వెనుక ఎవరు ఉన్నారు?? ఇదీ ప్రశ్న. దళిత క్రైస్తవ వర్గాలు తనకు అండగా ఉంటాయని సోనియాగాంధీ ఆశించింది. దానికితోడు ఆమె ఇండియాకు రావటం వెనుక మతం మార్పిడి వ్యూహం కూడా ఉంది. అంటే వాటికన్ ప్రోద్బలంతో అమెరికా నిధులతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. రాహుల్‌గాంధీ అమెరికాలో తాను క్రైస్తవుడినని చెప్పుకున్న డాక్యుమెంట్లు ఉన్నాయి.
ఎన్నికల సందర్భంలో ఉత్తరప్రదేశ్‌లో ‘నేను పండిట్ నెహ్రూగారి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడిని. యజ్ఞోపవీత ధారిని’ అని చెప్పుకోవటం చూచాము. గుజరాత్ ఎన్నికలలో సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి రుద్రాభిషేకాలు చేశాడు. అయితే సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణాన్ని ఆనాడు కె.ఎం.మున్షీ, సర్దార్‌వల్లభ్‌భాయ్ పటేల్‌లు తలపెడితే దానిని నిరోధించినవాడు పండిత జవహర్‌లాల్ నెహ్రూ. ఇదీ చరిత్ర. దీనిని ఎవరూ నేడు మార్చలేరు. సైద్ధాంతికాంశాలు ఎలాఉన్నా భారత ప్రధాని కాగల యోగ్యత విజ్ఞతల సంగతి అటుంచితే కనీసం వంద పార్లమెంటు సీట్లుకూడా రాహుల్‌గాంధీ వెనుక లేనప్పుడు ఆయన భారత ప్రధాని ఎలా కాగలడు? విపక్ష నాయకునిగా ఉండడానికి కావలసిన సంఖ్యాబలం కూడా ఇప్పుడు లేదు. అలాంటప్పుడు రాహుల్‌బాబు నేను భారత ప్రధానిని కాబోతున్నాను అని ప్రకటించడం హాస్యాస్పదం. ఇదే పరిస్థితి తక్కినవారి విషయంలోను ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రబాబునాయుడు తన కుమారుడు నారా లోకేశ్‌కు ఎ.పి. ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి, తాను కేంద్రంలో ప్రధాని కావాలని ఆశిస్తున్నారు. ఆశ ఎవరికైనా ఉంటుంది. ఐతే అందుకు తగిన అవకాశాలు ఇప్పుడున్నాయా? ఈ తృతీయఫ్రంట్ ఒక పెద్ద స్టంట్. 2019 తర్వాత ఎపిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఖాయంగా చెప్పలేము.
చంద్రబాబునాయుడు వెనుక ఉభయ కమ్యూనిస్టుపార్టీలు ఉన్నాయి. బిజెపిని ఓడించటంకోసం వారు ఏమైనా చేస్తారు. కేరళలో 300మంది హిందూ సామాజిక సంస్థలకు చెందిన కార్యకర్తలను హత్యచేశారు. కర్నాటకలో సిద్ధరామయ్య పాలనాకాలంలో పాతిక మంది బిజెపి కార్యకర్తలు చంపబడ్డారు. క్షీరభాగ్య అన్నభాగ్య వంటి పథకాలు సరే ఈ హత్యాభాగ్య పథకం మాటేమిటి?? ఇండియన్ కల్చరల్ నేషనలిజం బలపడకుండా కాంగ్రెసు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు శాయశక్తులా కృషిచేస్తాయి. వారికి ప్రత్యక్షంగానే పాకిస్తాన్, అమెరికాలు సహాయం చేస్తాయి. భారత ప్రధాని అంటే 130 కోట్ల జనాభాగల అతి పెద్ద ప్రజాస్వామ్యానికి అధిపతి అని అర్ధం. పరిపాలనాపరంగా చంద్రబాబునాయుడు వంటి వారికి అలాంటి యోగ్యతలు ఉన్నమాట వాస్తవమే. కాని రాహుల్ బాబు తగడు అని చాటుగా ఆ పార్టీ కార్యకర్తలే పెదవి విరుస్తున్నారు.
ఇక తెలంగాణా సంగతి చూద్దాము. ఇక్కడ రేవంత్‌రెడ్డి ఉపాఖ్యానం. ఇటీవల సంచలనం సృష్టించింది. ‘నేను తెలంగాణా ముఖ్యమంత్రిని కాబోతున్నాను’అని ఆయన ప్రకటించగానే పార్టీవర్గాలు భగ్గుమన్నాయి. నిన్నకాక ఇవ్వాళ పార్టీలో కొత్తగా చేరిన వాడిని అప్పుడే ముఖ్యమంత్రి పదవిని ఎట్లా ఆశిస్తావు? అంటూ యుద్ధానికి దిగారు. నిజమే కదా! తెలంగాణాలో ఉత్తమకుమార్‌రెడ్డి, జానారెడ్డి, డికె అరుణ, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, రేణుకాచౌదరి వంటి ఎందరో సీనియర్లు ఆ పదవిని ఆశిస్తుండగా నిన్న వచ్చిన రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రిని అవుతానని, ప్రధానమంత్రిని అవుతాను అంటే సరిపోతుందా?? వెంటనే ఆయనపై ఓటుకు నోటు కేసును తిరగతోడారు. అంటే ప్రధాని పదవిని ఆశించే చంద్రబాబునాయుడును, ముఖ్యమంత్రి పదవిని ఆశించే రేవంత్‌రెడ్డిని ఇద్దరినీ ఓటుకు నోటు కేసు ద్వారా జైలుకు పంపవచ్చు! మధ్యలో జరుసలేం ముత్తయ్య ఇది అన్యాయం అని ఆక్రోశిస్తున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములకే కాని న్యాయాన్యాయాలకు ప్రజాస్వామ్యంలో వర్తమాన యుగంలో తావులేదు.
భారత ప్రధాని కావాలని ప్రస్తుతం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన పరిపాలనాదక్షుడు. వ్యూహకర్త- ధార్మిక బుద్ధికలవాడు. హిందూ ముస్లింలు ఆయనకు రెండు కళ్లు. సమయోచితంగా పాచికలు విసిరి విజయానికి చేరువ కాగలడు. ఐతే ప్రధాని కావటానికి ఈ లక్షణాలు చాలవు. మూడువందల మంది ఎంపీల మద్దత్తు కావాలి. అది కెసిఆర్‌కు లేదు. తెలంగాణాలో 16 సీట్లలో ఎన్ని ఖాయంగా గెలుచుకోగలడో కూడా తెలియదు. ఇక తృతీయ ఫ్రంట్‌కు ఆయన నాయకుడుగా ఉండడానికి కారణం మమతాబెనర్జీ వంటివారు ససేమిరా అంగీకరించరు. చంద్రబాబు నాకు మంచి మిత్రుడు అని చెన్నై విమానాశ్రయంలో ప్రకటించిన కెసిఆర్ హైదరాబాదుకు రాగానే ఓటుకు నోటు కేసును ఎందుకు పునఃసమీక్షకు స్వీకరించినట్లు? ఇలా ఎన్నో వైవిధ్యాలు వైరుధ్యాలు ఉన్న తృతీయ ఫ్రంట్‌ను నమ్ముకొని ప్రధాని కావాలని ఎవరైనా ఆశిస్తే అది కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటం అని తెలుగు సామెతను గుర్తుకు చేస్తుంది. అంటే ప్రస్తుత భారతదేశ రాజకీయ పరిస్థితులలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఎదగగలిగిన మరొక రాజకీయ పార్టీ నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా నిలిచే రాజకీయ నాయకుడు లేడు అనేది సారాంశం.
అటు కాంగ్రెస్, ఇటు బిజెపిలను పక్కనపెట్టి తృతీయ ఫ్రంట్ ఎలా ఏర్పడుతుంది? ఇది కప్పల తక్కెడ వంటిది. ఒక కప్పను తక్కెడలోకి తెచ్చేసరికి రెండవది బయటకు దూకుతుంది. ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇలాంటిదే. ఎవరికీ దేశభక్తిలేదు. తాము పార్టీలనూ కుటుంబాలను ఆస్తులను కాపాడుకోవాలనే సంకల్పంతో రాజకీయాలల్లోకి ప్రవేశించినవారే. ఆ మాటకొస్తే బిజిజెపిలో కూడా దేవతలు లేరు. కాకుంటే నరేంద్రమోడీ స్వచ్ఛమైన నాయకుడు. ఆయన పాలనను నచ్చనివారు కూడా నరేంద్రమోడీ వ్యక్తిత్వాన్ని విమర్శించలేరు. అదే ఆయనకు బలం - బలగం.
మనకు అందుతున్న అనధికార వార్తలను బట్టి పంజాబు ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ను బిజెపిలోకి చేర్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెసు ముక్త్భారత్‌కు ఇది దారితీస్తుంది.
ఒక రాజకీయవేత్తకు దేశభక్తి చాలా ముఖ్యం. అది లేనపుడు వ్యక్తిగత స్వార్థానికి కులం, భాష ప్రాంతం వంటి అనేక ఆచ్ఛాదనలను పరివేషాలను ధరిస్తారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీగోర పరాజయం పాలైన తర్వాత జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వం మసకబారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎపిలో చంద్రబాబు పరిస్థితి దయనీయంగా మారింది.
తెలంగాణ బిజెపి బలమైన ప్రతిపక్షంగా ఎదగడమూ కాంగ్రెస్ ఆత్మవిశ్వాసం సడలిపోవడమూ వెంటనే జరిగే పరిణామాలు. కర్ణాటకకు ఆనుకుని వున్న కేరళ, తమిళనాడు, ఎపిలల్లో బిజెపి విస్తరణకు ఈ ఫలితాలు దారితీస్తాయి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668