శ్రీకాకుళం

అనుమానమే పెనుభూతమై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని పురుషోత్తంపురంలో ఎ.దమయంతి (23) అనే వివాహితను ఆమె భర్త వీరాస్వామి గొంతు నులిమి హత్య చేసినట్లు పట్టణ పోలీసులకు శనివారం సాయంత్రం ఫిర్యాదు అందింది, ఈ మేరకు సిఐ అవతారం, ఎస్‌ఐ రాము సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వారి కథనం ప్రకారం వీరాస్వామి దమయంతి రెండు సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. పాప పుట్టిన తరువాత పదినెలలకు వివాహం చేసుకున్నారు. అయితే భార్యపై అనుమానం ఉన్న వీరాస్వామి తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకుండా చూసి భార్య గొంతు నులిమి హత్య చేసాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జల వనరులను పరిరక్షించండి
* నీరు-చెట్టు పనులు రద్దు
* మళ్లీ టెండర్ల ప్రక్రియకు చర్యలు
* జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీనృసింహం

ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 19: జిల్లాలో జల వనరులను పరిరక్షించుటకు జలవనరులశాఖ పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. నీరు-చెట్టు కార్యక్రమంపై జలవనరులశాఖ ఇంజనీర్లతో శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జలవనరుల పరిస్థితిని పూర్తిగా పరిశీలించి దాని పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మహేంద్రతనయ ప్రాంతంలో గల ఉద్దానం నీటి ప్రాజెక్టుకు అవసరమగు నీటి లభ్యతకు ప్రాజెక్టు పరిసర ప్రాంతంలో మహేంద్రతనయా నదిలో కనీసం ఎనిమిది మీటర్ల మేర ఇసుక నిలువలు ఉండాలని అయితే, వివిధ కారణాల రీత్యా ఆ మేరకు ఇసుక విలువలు ఉండకపోవడంతో తాగు నీటికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పా రు.జలవనరులశాఖగా జిల్లాలో జలాల పరిరక్షణ బాధ్యతను చేపట్టి సమర్థవంతమైన జలవనరుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు.నీరు చెట్టు కార్యక్రమంలో సకాలంలో పనులు చేపట్టి పూర్తి చేయాలని అన్నారు.తద్వారా ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. చిన్న పనులు ఉంటే వాటిని ఉపాధిహామీ పనులకు విడిచి పెట్టాలని అన్నారు. ప్రజలకు తగు ఉపాధి పనులు లభిస్తుందని చెప్పారు.జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమం కింద మంజూరు చేసిన పనులు పూర్తి వివరాలు అందజేయాలని అన్నా రు. మంజూరు అయినప్పటికీ ప్రారం భం కాని పనుల సంఖ్యను అందించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం కాని పనులను రద్దుచేసి కొత్త టెండర్లను పిలవాలని ఆదేశించారు. టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి పనులు చేపట్టుటకుగాను 10 లక్షల లోపు విలువగల పనులకు తక్కు వ కాలపరిమితితో ఏడు రోజుల గడువుతో టెండర్లు పిలవాలని, 10 లక్షలుపై విలువగల పనులకు 14 రోజుల గడువుతో టెండర్లు పిలవాలని సమావేశంలో తీర్మాణిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు తయారు చేసారు. టెండర్ల నోటిఫికేషన్ ఆన్‌లైన్ విధానంలో ఇప్రాక్యూర్‌మెంటులో ఉన్నప్పటికి జిల్లా కలెక్టర్, రెవె న్యూ డివిజనల్ అధికారి, ప్రధానమైన జిల్లా, మండల అధికారుల కార్యాలయాలలో పెట్టడం వలన ఎక్కువ మం దికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్పారు. ముగించిన పనులకు సంబంధించిన ముగింపు నివేదికను విధిగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. వంశధార ప్రాజెక్టు పర్యవేక్ష ఇంజనీరు, నీరు చెట్టు కార్యక్రమం నోడల్ అధికారి బి.అప్పలనాయుడు పనుల పరిస్థితిని వివరించారు. ఈ సమావేశంలో జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు బి.రవీంద్ర, మడ్డువలస ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీరు డి.పి. ప్రదీప్, వంశధార ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్లు, డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఎఎన్‌ఎం ఆన్‌లైన్ ద్వారా మెరుగైన వైద్యం
* డిఎంహెచ్‌వో డాక్టర్ శ్యామల
శ్రీకాకుళం(టౌన్), మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎఎన్‌ఎం ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా త్వరితగతిన మెరుగైన వైద్యం అందించడంతో పాటు మాతా శిశు మరణాలను నివారించగలమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఆర్.శ్యామల తెలిపారు.ఈ మేరకు శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిప్యూటీ డియంహెచ్‌వోలు, పిహెచ్‌సి వైద్యాధికారులుకు ఎఎన్‌ఎం ఆన్‌లైన్ సిస్టమ్ వినియోగంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు సుధాకర్ బాబు, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డిలు హాజరై వైద్యాధికారులకు ఆన్‌లైన్ సిస్టమ్ వినియోగంలో అపోహలు తొలగించారు. ఈ సందర్బంగా డియంహెచ్‌వో మాట్లాడుతూ ఈ ఆన్‌లైన్ సిస్టమ్ యునిసెఫ్ రూపొందించిందని, దీని ద్వారా ఎప్పటికప్పుడు గర్భిణీ స్ర్తిల వివరాలతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని ముందస్తుగా అంచనా వేసే అవకాశం సంబంధిత వైద్యాధికారులకు కలుగుతుందన్నారు. భవిష్యత్‌లో ఈ సాప్ట్‌వేర్ వినియోగం ద్వారా మాతా శిశు మరణాలన్నవే లేకుండా చేయవచ్చని ఆమె ఆకాంక్షను వెల్లడించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వైద్యాధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు, జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మెండ ప్రవీణ్‌లు పాల్గొన్నారు.

గేట్‌లో సిక్కోలు విద్యార్థి ప్రతిభ
* 70వ ర్యాంక్ సాధించిన శ్రీనివాసరావు
సారవకోట, మార్చి 19: జాతీయ స్థాయిలో నిర్వహించిన గేట్ పరీక్షలో మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన రావాడ శ్రీనివాసరావు 70వ ర్యాంకు పొంది ఉద్యోగం సంపాదించాడు. సాధారణ కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు పదవతరగతి వరకు స్థానిక పాఠశాలల్లోనే చదివి ట్రిపుల్ ఐటికి ఎంపికై బాసరలో ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. అనంతరం కేంపస్ ఇంటర్వూల్లో ఎంపికై విప్రోలో పనిచేస్తున్నాడు. గేట్ పరీక్ష కూడా రాసి ఎంపికయ్యాడు. బి.హెచ్.సి.ఎల్., ఎన్.టి.పి.సి. తదితర కంపెనీల్లో ఉద్యోగం వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దేశంలో సుమారు 2లక్షల 80వేల మంది పరీక్షలు రాయగా శ్రీనివాసరావు 70వ ర్యాంకు సాధించడం విశేషం. గేట్‌కు ఎంపికైన శ్రీనివాసరావును తల్లితండ్రులతో పాటు పలువురు అభినందించారు.
ఆలయాల్లో ఏకాదశి పూజలు
శ్రీకాకుళం(కల్చరల్), మార్చి 19: శుద్ధ ఏకాదశిని పురష్కరించుకుని శనివారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతశ్రీకాకుళంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు జోష్యుల బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీదేవి- భూదేవి సమేత శ్రీనివాసుడుకి అష్టోత్తర శతనామ పూజలు, అభిషేకా లు దర్శనాలు భక్తుల గోవిందనామ స్మరణ మధ్య వైభవంగా సాగాయి. గుజరాతీపేట నారాయణతిరుమలలో అర్చకులు శ్రీనివాసస్వామి ఆధ్వర్యంలో ఏకాదశ పూజలు నిర్వహించారు. అలాగే, దత్తపీఠంలో శనివారం సామూహిక సత్యన్నారాయణ వ్రతాల్లో 45 మంది దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రతీ నెలా శుద్ధఏకాదశినాడు ఇటువంటి వ్రతాలు చేయించేందుకు నిర్ణయించినట్లు ట్రస్టు పేర్ల బాలాజీ, అర్చకులు బంకుపల్లి సింహాచలంశర్మలు తెలిపారు.
చక్కెర ఫ్యాక్టరీని తక్షణమే తెరిపించాలి: సిపిఎం
ఆమదాలవలస, మార్చి 19: ప్రైవేట్ యాజమాన్యం చేతినుండి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన స్థానిక సహకార చక్కెర కర్మాగారాన్ని తక్షణమే తెరిపించాలని సిపియం సీనియర్ నేత చౌదరి తేజేశ్వరరావు డిమాండ్ చేసారు. శనివారం ఈ మేరకు ఆయన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఎపి రైతు సంఘం సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో రైతు సం ఘం నేతలుపంచాది కృష్ణ, బెండి మధు, నారాయణరావు, చింతాడ సీతారాం, మురళి, కోనారి మోహనరావు పాల్గొన్నారు.