శ్రీకాకుళం

అధికారుల తీరుపై తమ్మినేని ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), జూలై 2: జిల్లాలో అర్హులైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందజేస్తున్న పింఛను బట్వాడాలో ఎంపిడివోలు జిల్లా కలెక్టర్‌ను సైతం మభ్యపెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ రాష్ట్ర సభ్యులు తమ్మినేని సీతారాం విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక జిల్లా వ్యాప్తంగా సుమారు 64వేల పింఛన్లు తొలగించారన్నారు. అయితే పొందూరు మండల వైకాపా నేతలు దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తే లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు చెబుతూ మార్చి ఒకటో తేదీ నుంచి మండంలోని 348 మందికి పింఛన్లు అందజేయాలని ఆదేశాలిచ్చిందన్నారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో మరల కంటెప్ట్ పిటిషన్ వేస్తే బకాయిలతో పాటు రెగ్యులర్‌గా పంపిణీ చేస్తున్న లబ్దిదారుల జాబితాలో చేర్చాలని ఆదేశాలిచ్చిన విషయాన్ని గుర్తుచేసారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ను కలిసి వివరించగా బకాయి పింఛన్లకోసం ఆర్థిక లబ్దికి ప్రభుత్వానికి రాసామని పేర్కొంటున్నారని, అయితే ఎంపిడివో కార్యాలయానికి నిధులు ఏనాడో మంజూరయ్యాయని అన్నారు. నిధులు మంజూరైన విషయం జిల్లా కలెక్టర్‌కే తెలియలేదంటే ఇంతకంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా అంటూ ధ్వజమెత్తారు. పైగా అక్కడి ప్రజాప్రతినిధులు పింఛన్లు తామే మంజూరు చేయించామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయవ్యవస్థపై విశ్వాసముంచి గ్రామాధికారుల ద్వారా తక్షణమే పింఛన్లు పంపిణీ చేయించాలని ఆయన కోరారు. సమావేశంలో వైకాపా నేతలు మొదలవలస రామస్వామి నాయుడు, గురుగుబెల్లి జగన్నాథం, గాంధి, కొంచాడ రామ్మూర్తి, గంట్యాడ రమేష్, శ్రీరంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.