శ్రీకాకుళం

ప్రజా సమస్యలు పరిష్కరించడమే అధికారుల విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, నవంబర్ 21: ప్రభుత్వ అధికారులు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. ఎపి మానవ వనరుల అభివృద్ధి, జిల్లా శిక్షణ సంస్థల సంయుక్తంగా ఎస్‌ఎం పురం పరిధిలో 21వ శతాబ్దపు గురుకుల భవనంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు 12 రోజులు శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.
ఈ శిక్షణను కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నీతి నిజాయితీ పక్షపాతం బంధుప్రీతి వంటి అంశాలకు తావులేకుండా విధులు నిర్వహించాలన్నారు. ఉద్యోగ విధులను అర్హులైన వారికి సహాయ పడే విధంగా నిర్వహించాలని సూచించారు. నిరుపేదలకు సహాయ అందిన విధంగా సామాజిక బాధ్యతతో విధుల్లో పరిపాలనా దక్షత అలవర్చుకోవాలన్నారు. చక్కని విచిక్షణతో పౌరుల పనులను పూర్తిచేయాలన్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల పనులకు సహేతుకు కారణాలు చూడాలని ఉద్భోధించారు. చేపట్టిన పనిలో మంచి చెడులను ఆత్మసాక్షిగా చేయాలని సూచించారు. నిబంధనలను అనుగుణంగా అసాధ్యం అనే పనులను చక్కబెట్టే సత్తా సంపాదించాలని పేర్కొన్నారు. ఎదుటివ్యక్తి అవసరం, దానిని పరిష్కరించడంలో ఆవశ్యకత పరిశీలించాలన్నారు. ప్రతీ ఉద్యోగి జిల్లా ఆఫీసు మ్యాన్యువల్, ఎపి కాండాక్ట్ రూల్స్ 1964 తప్పక చదవాలని సూచించారు. తన విధుల నిర్వహణలో చక్కటి ప్రభావం స్ఫూర్తి చూపించాలన్నారు. వ్యక్తిగత సంస్థాగత విలువలు పాటించాలని స్పష్టంచేశారు. ప్రేమ అనురాగం ధైర్యం వంటి అంశాలతోప్రజలకు మంచి సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి జయించడం కోసం ద్యానం యోగా వంటి కార్యక్రమాలు అలవర్చుకొని సమయ పాలన పాటించాలన్నారు.
జిల్లాలో 70శాతం వ్యవహరాలు కంప్యూటరీకరణ చేసే ఈ గవర్నర్స్‌ద్వారా జరుగుతున్నాయని మిగిలిన 30శాతం త్వరితగతిన పూర్తిచేసి పేపర్‌లెస్ కార్యాలయాలను తీర్చిదిద్దుతామన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో మానవ వనరులు అభివృద్ధి సంస్థ అధికారి పి.జనార్దనరెడ్డి శిక్షణా కార్యక్రమం అవశ్యకతను వివరించారు. ఐతం కళాశాల డీన్ ప్రొఫెసర్ విష్ణుమూర్తి శిక్షణ మాడ్యుల్‌ను వివరించారు. శిక్షణా సంస్థ అధికారి ఎల్.గరికవాడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.