శ్రీకాకుళం

మత్స్యకారుల అభ్యున్నతికే భావనపాడు పోర్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 21: మత్స్యకారులంతా మార్పును స్వీకరించి, అభివృద్ధికిలోకి రావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రెండో షిప్పింగ్ హార్బర్ కోసం ప్రతిపాదనలు కోరిందని, ఈ మేరకు కలెక్టర్ వాటిని ముఖ్యమంత్రికి సమర్పించినట్టు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా రవికుమార్ పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి, మాట్లాడారు. అంతర్జాతీయస్థాయిలో ఉత్పత్తుల ప్రమాణాలు ఉంటే ఆదాయం పదిరెట్లు పెరుగుతుందని, మత్స్యసంపదను నమ్ముకుని కొన్ని దేశాలు సంపన్నదేశాలుగా మారాయని, అటువంటి సంపద సిక్కోల్‌లో ఉందన్నారు. ఆధునిక విజ్ఞాన పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలని, అందుకు మత్స్యకారులంతా ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వం నిర్మించనున్న భావనపాడుపోర్టుకు సహకారం అందించాలని ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మత్స్యకారులకు ప్రత్యక స్థానం కల్పించారన్నారు. మత్స్యకారులో స్ఫూర్తిని నింపారని, మత్స్యకార సమాజంలో మార్పు తీసుకువచ్చారని చెప్పారు. జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటి ద్వారా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 50 ఏళ్ళుగా భావనపాడు పోర్టు కోసం మాట్లాడుతున్నారని, అయితే, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్మించేందుకు చర్యలు చేపట్టిందని అన్నారు. 2,800 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ పోర్టు జిల్లాకు తలమానికంగా ఉంటుందని అన్నారు. మత్స్యకార పిల్లలకు అంపోలులో బి.సి.గురుకులం ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా వజ్రపుకొత్తూరులో మరో గురుకులం ఏర్పటు కానుందని చెప్పారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు కృషి చేస్తామని చెప్పారు.
జెడ్‌పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రమాదంతో కూడిన పరిస్థితుల్లో మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే, బతుకులో పురోగతి సాధించేందుకు ప్రతీ ఒక్కరి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు రావాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ మత్స్యకారులు ఏకాభిప్రాయంతో ఏది కోరితే దానిని చేయుటకు సిద్ధంగా ఉన్నామన్నారు. 4.80 లక్షల రూపాయల విలువగల బోటు వలలు ఇతర పరికరాలను మంజూరు చేశామన్నారు. మత్స్యకారులు కూడా చంద్రన్న బీమాలో పేర్లు నమోదు కావాలని కోరారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు చంద్రబాబునాయుడు అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం, హక్కులను గూర్తిచ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యంత వెనుకబడిన కులంగా గుర్తించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ భావనపాడు ఉత్తర కోస్తాలో అత్యుత్తమ పోర్టుగా రూపొందుతుందన్నారు. మత్స్యకారుల జీవనానికి, ఉపాధికి ఇబ్బంది లేకుండా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం లేదా ఎచ్చెర్ల మండలాల్లో రెండో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ప్రతిపాదించామని చెప్పారు. అధిక ఆదాయాలు సమకూర్చేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. మార్పును స్వీకరించి మెరుగైన స్థిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు రవాణా వాహనాలు, చేపలవేటకు అవసరమయ్యే సామగ్రి పంపిణీ చేశారు. మత్స్యకార ప్రతినిధులు కొమర కమల, మైలపల్లి మహాలక్ష్మీ, చింతపల్లి సత్యన్నాయరాణ తదితరులు మాట్లాడుతూ మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి మార్చాలని, తీరప్రాంతంలో కర్మాగారాలు నెలకొల్పుతున్నప్పటికీ ఉద్యోగాలు ఉండటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు గొండు జగన్నాథరావు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మైలపల్లి నర్సింగరావు, త్రినాథరావు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.