శ్రీకాకుళం

నాయకత్వంతో ఆదర్శవంతులు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 22: మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని భావితరాలకు ఆదర్శవంతులుగా తయారు కావాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. జెడ్‌పి సమావేశ మందిరంలో మంగళవారం యూ ఎన్ మహిళ-రెండో విడత మల్టీసెక్టోరల్ అక్రోచ్ అవకాశాల నుంచి సామార్థ్యాలవైపు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏపి ఎస్‌ఐఆర్‌డి ఉపసంచాలకులు అబ్దుల్ హరీమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా ప్రజాప్రతినిధులు జిల్లాలో అధికంగా ఉన్నారని 50శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అధికారాలను సక్రమంగా వినియోగించుకొని చక్కటి పాలన అందించాలన్నారు. ఒకప్పటి మహిళ ఏమీతెలియని అమాయకత్వంతో ఉండేదని స్వయంశక్తి సంఘాలు, బ్యాంకు రుణాల ద్వారా లక్షలాది రూపాయలతో వ్యాపారాలు నిర్వహించుకోగలిగే స్థాయికి ఎదిగారన్నారు. కుటుంబంతోపాటు ఉద్యోగాన్ని రెండుపక్కల సమర్థవంతంగానిర్వహించుకోగల సత్తా మహిళలకే ఉందన్నారు. చిన్నతనం నుండి ఆడా మగా తేడా చూపకుండా తల్లిదండ్రులు సమదృష్టితో పెంచాలని ఎక్కువగా మహిళలే వరకట్న వేధింపులకు పాల్పడటం శోచనీయమన్నారు. రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి మాట్లాడుతూ
మహిళల్లోని శక్తిని వెలికి తీయాలని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగల మహిళ ఉద్యోగాలు, రాజకీయాలను సైతం సక్రమంగా నిర్వహించుకోగలదని నిరూపించాలన్నారు. ఎమ్మెల్యే లక్ష్మీదేవి మాట్లాడుతూ దివంగత నందమూరి తారకరామారావు మహిళల అభివృద్ధికి పెద్దపీఠ వేశారన్నారు. బాల్య వివాహాలను అడ్డుకొని మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ జిల్లాలో పురుషుల నిష్పత్తిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఆరేళ్లలోపు పిల్లలలో 1000మందికి 953మంది మాత్రమే ఆడపిల్లలు ఉండటం భవిష్యత్‌కు అనర్థదాయకమన్నారు. గ్రామ, జిల్లా, రాష్టస్థ్రాయి ప్రణాళికా రూపకల్పనలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శోభ, జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు, జెడ్‌పి సిఈవో నగేష్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సత్యప్రభ, సెట్ శ్రీ సిఈవో వివిఆర్‌ఎస్ మూర్తి, వయోజన విద్య డిడి కృష్ణారావు, ఎంపిడివోలు, ఎంపిపిలు, జెడ్‌పిటిసి సర్పంచ్‌లు పాల్గొన్నారు.

నైపుణ్యాభివృద్ధికే డిజిటల్ క్లాస్‌రూమ్

ఎచ్చెర్ల, నవంబర్ 22: పాఠశాల స్థాయి నుండి విద్యార్థులను మరింత నైపుణ్యంగా తీర్చిదిద్దేందుకు డిజిటల్ క్లాస్ రూమ్‌ను రూపొందించామని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టంచేశారు. చిలకపాలెం కూడలిలో గల శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ నిర్వహణపై రిసోర్స్‌పర్సన్‌ల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సెంటర్(ఎర్నెట్) ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం 204 పాఠశాలలో డిజిటల్ క్లాస్‌రూమ్‌ను అమలు చేస్తున్నామని దశలవారీగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమంలో ఐదు జిల్లాలకు చెందిన 84మంది రిసోర్స్ పర్సన్‌లకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణలో నేర్చుకున్న వివిధ అంశాలను డిజిటల్ క్లాస్‌రూమ్‌కు ఎంపికైన పాఠశాల బోధకులకు అవగాహన కల్పించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు డిఈవో డి.దేవానందరెడ్డి తెలిపారు. ఎర్నెట్ ప్రాజెక్టు అధికారి అరవింద్, సాఫ్ట్‌వేర్ డిజైనర్ బాల లు పలు విషయాలపై అవగాహన రిసోర్స్‌పర్సన్‌లకు కల్పించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరిలకు చెందిన రిసోర్స్ పర్సన్‌లు ఈ శిక్షణకు హాజరయ్యారు.