శ్రీకాకుళం

జనవరి 1నుంచి6నగదురహిత పల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 22: రానున్న జనవరి 1వ తేదీ నుంచి జిల్లా అంతటా సంపూర్ణ నగదురహిత గ్రామాలుగా మారుస్తామని, ఆర్థిక లావాదేవీలన్నీ నగదురహితంగా చేసేలా ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తామని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు విషయంలో ఎక్కువ శాతం ప్రజలు అనుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నగదురహిత కార్యకలాపాలు స్వచ్ఛందంగానే జరిగేందుకు అవకాశాలు ఉన్నట్టు వివరించారు. రానున్న కాలం పూర్తిగా నగదు రహిత కార్యకలాపాలదేనని అన్నారు. ఇక్కడి ఆంధ్రా బ్యాంకు జోనల్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ల(బి.సి) అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. బిజినెస్ కరస్పాండెంట్ల (బి.సి)ల పాత్ర ప్రస్తుతం క్రీయాశీలకమన్నారు. ప్రజల్లోనగదు రహిత కార్యకలాపాలపై అవగాహన కలిగించేందుకు, వారి కార్యకలాపాలలో తోడ్పాటును అందించేందుకు ముఖ్యపాత్ర పోషించాలని అన్నారు. నగదు రహిత సమాజం ఏర్పడుతున్నందున బి.సి.ల ప్రాధాన్యం అధికం అవుతుందని అన్నారు. అందుకు తగిన విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బ్యాంకులు కొత్తగా నియామకాలు చేపట్టనసరం లేదనే విధంగా సేవలు అందించాలని ఆయనకోరారు. చక్కటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాలని అన్నారు. అధికంగా వ్యాపారం చేసే వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదిస్తామని అన్నారు. నగదు రహిత సమాజం దిశగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక పింఛన్లు, ఉపాధిహామీ వేతనాలు ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానించిన జన్‌ధన్ ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో రూ.33 కోట్లను పింఛన్లుగా ప్రతీనెలా పంపిణీ చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా జిల్లాలోగల దాదాపు 400 మీసేవా కేంద్రాలను, 2099 చౌకధరల దుకాణాల డీలర్లను బిజినెస్ కరస్పాండెంట్లుగా చేసేందుకు యోచిస్తున్నామన్నారు. ఇప్పటికే చౌకధరల దుకాణాల్లో నగదు రహిత స్థితికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రైతుబజార్లలో స్వేప్ మెషిన్లను, మినీ ఏటీఎంలను ఏర్పాటు చేశామని చెప్పారు. మినీ ఏటీఎంల నుంచి ఐదు వందల రూపాయల వరకు 50, వంద రూపాయల నోట్లను పొందవచ్చని చెప్పారు. సీతంపేటలో సోమవారం ప్రారంభించామని, ప్రతీ సోమవారం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. విద్యుత్ బిల్లులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో అనుసంధానం చేసి చెల్లింపులకు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్ స్టేషన్‌లలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు జరుగుతున్నాయని చెప్పారు. మద్యం విక్రయాల వద్ద స్వైప్ మెషిన్ ఏర్పాటు చేయాలని యోచన ఉందని చెప్పారు. తద్వారా ఎం.ఆర్.పి. ధరలకు విక్రయిస్తారని, బెల్టుషాపులు నివారణకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో ప్రతీ వ్యవహారం బ్యాంకు ఖాతాల ద్వారానే జరుగుతుందని అన్నారు. జిల్లాలోగల 38 మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి నగదు రహిత గ్రామంగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. బ్యాంకు శాఖలు ఆ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించి నగదు రహిత కార్యకలాపా దిశగా తీసుకువెళ్ళడం దీని ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ నుంచి సంపూర్ణ నగదురహిత గ్రామాలుగా ఇవి ఆవిర్భవించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజర్ బి.ఆర్.కె.రావు, సహాయ జీఎం కె.రాజేంద్రకుమార్, లీడ్‌బ్యాంకు మేనేజర్ పి.వెంకటేశ్వరరావు, చీఫ్ మేనేజర్ బి.వెంకటేశ్వరశాస్ర్తీ, ఆర్థిక సలహాదారులు ఆర్.ఆర్.ఎం.పట్నాయిక్, కె.గిరిజాశంకర్, బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లు, తదితరులు పాల్గొన్నారు.