శ్రీకాకుళం

తీరం దాటిన తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, డిసెంబర్ 1: ఈశాన్యరుతుపవనాలు కారణంగా గురువారం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఛాయలు సాయంత్రానికి తీరం దాటినట్లు స్థానిక కృషివిజ్ఞాన్ కేంద్రం వాతావరణ పరిశోధాన శాస్తవ్రేత్త కె.జగన్నాధశర్మ తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో ఏర్పడిన ఈదురగాలులు , తుఫాన్ బలహీన పడిందని దీని వలన ఉత్తరాంధ్రా జిల్లాలకు శుక్రవారం పొడిగాలి వ్యాపిస్తుందని ఆయన తెలిపారు. దీనిపై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి

శ్రీకాకుళం, డిసెంబర్ 1: ఎయిడ్స్ రహిత సమాజంగా జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ ఏర్పాటు చేసిన ర్యాలీకార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డితో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ వ్యాధి నివారించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎయిడ్స్ వ్యాప్తిచెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం, వ్యాదిగ్రస్తుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు గల చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తొలుత జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఏర్పాటు చేసిన రక్త్ధాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థిణులను కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం రాష్ట్ర స్థాయిలో రక్తదానం చేసేందుకు రక్తదాతలు ముందుకు వచ్చే విధంగా విశేష కృషి చేసిన పెంకి చైతన్యకుమార్‌కు జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఎస్.తిరుపతిరావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రత్నకుమారి, ఆరోగ్య బాలరక్ష నోడల్ అధికారి మెండ ప్రవీణ్, డి ఐవో బి.జగన్నాధరావు, నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారి దవళభాస్కరరావు, ప్రిన్సిపల్ జ్యోతిఫెడ్రిక్, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, పి.చైతన్యకుమార్, మంత్రి వెంకటస్వామి, బెజ్జిపురం యూత్‌క్లబ్ అధ్యక్షులు ఎం.ప్రసాదరావు, వివిద నర్శింగకళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.