శ్రీకాకుళం

దడపుట్టిస్తున్న ‘నాడా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, డిసెంబర్ 1: ఆరుగాళం కష్టపేడ అన్నదాతలను ప్రకృతి వైపరిత్యాలు ఉరుకులు పరుగులు పెట్టించడం పరిపాటే. ఈ ఏడాది ఖరీఫ్ ఆటంకాలన్నీ దాటుకొని పంట కల్లాలకు చేర్చేందుకు మరింత ఆసక్తి కనబరిచిన రైతాంగాన్ని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నాడా’ తుఫాన్ దడ పుట్టిస్తుంది. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం వాయుగుంఢంగా మారి ఇది మరింత బలపడి తుఫాన్‌గా రూపాంతరం చెందిందని భారత వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలకు అనుకూలంగా ఆకాశంమేఘావృతం కావడం వర్షసూచన ఉందన్న విశ్వాసం రైతులకు మరింత కలగడంతో వారంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వరికోతలు పూర్తి చేసి పొలాల్లోనే చేని దిబ్బలుగా పెట్టిన వారంతా వీటిని మరింత భద్రపరిచే పనిలో తీరిక లేకుండా గురువారం గడపడం కనిపించింది. మరికొంతమంది పరుపుతో ఉన్న వరిచేనును కల్లాలకు మోసి కుప్పలు వేసే పనుల్లో తీరికలేకుండా ఒకింత ఉత్కంఠకు లోనౌతున్నారు. సరిగ్గా కోతలు ప్రారంభమైన సమయానికి కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో చిల్లర సమస్య వ్యవసాయ పనులపై ఆధారపడిన కూలీలను ఒకింత ఇబ్బందులకు గురి చేసింది. రైతులు కూడా పెద్దనోట్లు రద్దు కారణంగా సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికాక నానా ఇబ్బందులు పడ్డారు. కోతలు, మోతలు నూర్పులు వంటి పనులు మందకొడిగా సాగడం అన్నదాతలను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. పంట చేతికి వచ్చే సమయానికి ఇటువంటి హెచ్చరికలు రైతు కుటుంబాలను కంటి మీద కునుకులేకుండా చేయడం షరామమూలే. అన్ని కలిసొచ్చి పండించిన సిరులరాసులు అమ్మకానికి సిద్ధం చేసిన ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడంతో వీటిని కంటికిరెప్పల కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం, అటు మిల్లింగ్ ప్రారంభం కాకపోవడంతో నూర్పులు పూర్తి చేసిన రైతులు కల్లాల్లోనే బస్తాల్లో భద్రపరిచి వాటికి పహారా కాస్తున్నారు. వరుణదేవుడు కరుణించి చినుకు రాల్చకూడలని రైతులంతా వేయిదేవుళ్లకుక మొక్కుతున్నారు. నడ తుఫాన్ రూపాంతరం చెంది వర్షం కురిస్తే పండిన పంటంతా తడిసి ముద్దవుతుందన్న దిగులు అన్నదాతలను కలవరానికి గురి చేస్తుంది. ఇదిలా ఉండగా సువిశాల తీరం ఉన్న జిల్లాలో తరచూ తుఫాన్ హెచ్చరికలు ఇక్కడ మత్స్యకారులను పస్తులుండేలా చేస్తున్నాయి. ప్రధాన ఓడరేవుల్లో ప్రధాన హెచ్చరికలు, తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని అధికారుల సూచనలు గంగపుత్రులను ఇళ్లకే పరిమితం చేశాయి. దీంతో తీరమంతా నిర్మాణుష్యంగా మారింది. నడ తుఫాన్ గంటకు 45నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురగాలులు వీస్తాయని అధికారులు చేసిన హెచ్చరికలు మత్స్యకారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ తుఫాన్ తీరం దాటి ఇటు రైతులను అటు మత్స్యకారులకు ఊరటనివ్వాలని ఆశిద్దాం.