శ్రీకాకుళం

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 19: జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ ఆదాలత్‌లో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్‌లో జాతీ య లోక్ ఆదాలత్ పోస్టర్ ఇతర న్యా యమూర్తులతో కలిసి ఆమె లాంఛనం గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిబ్రవరి 11వతేదీన జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహిస్తామన్నారు. ఉదయం 10.30 నుంచి న్యాయసేవాసదన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం, జిల్లా కోర్టు సముదాయం, జిల్లాలోని ఇతర కోర్టు సముదాయాల్లో జాతీయ లోక్ ఆదాలత్ జరుగుతుందన్నారు. ఇందులో రాజీపడ్డదగ్గ క్రిమినల్, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనిస్ట్రిమెంట్ యాక్ట్, మోటార్ ఎక్సిడెంట్ క్లయిమ్, ఫ్యామిలీ కోర్టు, లేబర్, ప్రభుత్వ భూసేకరణ, బ్యాంకు, సివిల్, రెవెన్యూ కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. వీటితోపాటు పాత పెండింగ్ కేసులకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఫ్రీ లిటికేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫ్రీ లిటికేషన్ కేసుల పరిష్కారానికై ఈ నెల 25వతేదీలోగా దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కేసులను సత్వరంగా పరిష్కరించి జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. కక్షిదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్‌కుమారి, న్యాయమూర్తులు గౌతమ్‌ప్రసాద్, కె.సుధామణి, వి.గోపాలకృష్ణారావు, పి.రాజేంద్రప్రసాద్, ఎన్.పద్మావతి, కె.నాగమణి, వై.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, కార్యదర్శి మామిడి శ్రీకాంత్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

‘యువ మహోత్సవాన్ని
విజయవంతం చేయండి’
శ్రీకాకుళం(రూరల్), జనవరి 19: ఆసక్తిగల యువతీ యువకులు ఈనెల 20 నుంచి 22వతేదీ వరకు జరగనున్న యువ మహోత్సవ్-2017లో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వివిఆర్‌ఎస్ మూర్తి తెలిపారు. గురువారం కార్యాలయంలో యువ మహోత్సవం-2017పై ఆయన విలేఖర్ల సమావేశం నిర్వహించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువ మహోత్సవాన్ని మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం 10 నుంచి నిర్వహిస్తామన్నారు. వేడుకల్లో పాల్గొనే వారు 15-29 సంవత్సరాలు మధ్య ఉండాలన్నారు. కార్యక్రమంలో యువతీ యువకులు వారి పేర్లను నమోదు చేసుకోవల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందన్నారు. వ్యాసరచన, పతంగుల పోటీలు, ముగ్గుల పోటీలు, శాస్ర్తియ నృత్యాలు, సంగీతం, ఇతర నృత్యాలు, నగదు రహిత లావాదేవీలపై చర్చ ఉంటుందని, 21న ఖోఖో, టగ్ ఆఫ్ వార్, కబడ్డీ, వాలీబాల్, బాడ్మింటన్, ఫన్ యాక్టివిటీస్, ట్రై సైకిల్ పోటీలు, ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, యూత్ ఎంపవర్‌మెంట్‌పై సదస్సు ఉంటుందన్నారు. 22న మారథాన్, 5కె రన్, 10కె సైక్లింగ్, వివేకానందపై వీధినాటకాలు, గ్రూప్ డాన్స్‌లు, ఫ్యాన్సీ డ్రెస్, పాటలు, జానపదాలు, ఫోటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు. అంతకుముందు యువ మహోత్సవ పోటీల పోస్టర్‌ను జిల్లా పర్యటకాధికారి ఎం.నారాయణ, మూర్తి విడుదల చేశారు.