శ్రీకాకుళం

జీవచ్ఛవాలు..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: వీరంతా వయస్సు పైబడి చనిపోయిన వారు కాదు..రోడ్డు ప్రమాదంలోనో, కుటుంబ కారణాలతో చనిపోలేదు. కేవలం కిడ్నీరోగం బారినపడి చనిపోతున్నారు. ఇప్పటికీ 894 మంది మృతి చెందితే, 3458 మంది జీవచ్ఛవాల్లా బతుకీడిస్తున్నారు..ఉద్దానంలో నివాసం ఉండడమే వారు చేసిన పాపం. ఉన్నఊరు, కన్నతల్లిని వదిలేసి సుదూరంగా బ్రతుకుజీవుడా..అన్నట్టు వలసబాట పడితే - అప్పటికీ కిడ్నీరోగం ఆ శరీరానికి పట్టకపోతే..సరే!! ఆ మహమ్మారి ఒంటికి పట్టినట్టయితే భూప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మృత్యువు వెంటాడుతూనే ఉంటాది. మృత్యువుతో ప్రతీ నిమిషం పోరాటం చేసే వందలు, వేల మంది గురువారం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తమ రోగానికి చెందిన పరీక్షల పత్రాలతో ప్రభుత్వ సాయం కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిసి వారి మొర వినిపించారు. ఉద్దానం ప్రాంతమంతా భయంకర మహమ్మారి చేతిలో చిక్కి విలవిల్లాడుతోంది. ఒక్కరోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా మూడున్నర దశాబ్ధాలుగా అక్కడ జనాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు చెబుతున్నా..వారికి కావల్సిన ఆరోగ్యభద్రత, ఆర్థిక భరోసా కల్పించ లేకపోయిందని జనసేనా అధినేత పవన్‌కళ్యాణ్ ఇటీవల ఉద్దానానికి వచ్చి కిడ్నీరోగులతో మాట్లాడి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెబితేగాని తెలియరాలేదు. ఆర్థికభరోసా, ఆరోగ్యభద్రతను 48 గంటల్లో కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలన్న అల్టిమేటానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వేలాది మంది కిడ్నీరోగులు గురువారం క్యూలు కట్టారు.
ఆ మహమ్మారిని పారదోలుతామంటూ రాజకీయ నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇక్కడ మూత్రపిండ వ్యాధిగ్రస్తుల వివరాలు, నివేదికలు, పరీక్షలు నిర్వహించే పత్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాను శుక్రవారం ఢిల్లీలో కలియనున్నారు. రాష్ట్రంలో 19 డయాలసిస్ సెంటర్లు, ఉద్దానంలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సాయం కోరనున్నారు.
ఇదంతా ‘జన’సేన వచ్చి.. వెళ్ళినందుకే..అంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం గత కొనే్నళ్ళుగా కిడ్నీరోగుల పట్ల శ్రద్ధ కనబరుస్తున్నప్పటికీ, ఆ నిధులు దారి మళ్లుతున్నాయన్న ఆరోపణలకు తాజాగా పవన్‌కళ్యాణ్ పర్యటనతో బలపడింది. దీనిని పక్కతోవ పట్టించే ప్రయత్నంలో ఉద్దానంపై రాష్ట్ర ప్రభుత్వానికి అమాంతంగా భద్రత, భరోసా అనే అంశాలతో ముందుకు వచ్చింది. దీని ప్రభావమే వేలాది మంది పిన్నవయస్సు పిల్లల నుంచి పండుటాకుల వరకూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రిసెప్షన్ కౌంటర్ల వద్ద బారులుతీరి వారి పేర్లు నమోదు చేయించుకున్నారు.
కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాలో ఇంటికో మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారంతా ఆరోగ్యమంత్రి కామినేని ముందు క్యూకట్టారు. ఆరోగ్య భద్రత కల్పిస్తారా? ఆర్థిక భరోసా ఇస్తారా?? అన్న అంశాలు పక్కనపెడితే - ఇటీవల రాజాంలో జన్మభూమి- మావూరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేసి కిడ్నీరోగులకు పింఛన్లు, బస్సు పాస్‌లు ఇస్తామన్న హామీ నెరవేర్చే సమయం ఆసన్నమైందని, మీ ఇంటిల్లిపాది ఆరోగ్యమంత్రి సభకు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే భవిష్యత్‌లో బాబు ఇచ్చిన వరాలు అందుతాయని ఉద్దానంలో సాగిన ప్రచారానికి మూత్రపిండాలు పిండిగా మారిపోయిన వృద్ధులు సైతం కాళ్ళు ఈడ్చుకుంటూ ఆశతో సోంపేట వచ్చారు. వారందరికీ రవాణా సౌకర్యం, ఉచిత మందులు, వైద్యఆరోగ్యశాఖ బృందాలు, ఇంటింటికీ పరీక్షలు అంటూ మంత్రి కామినేని చెప్పిన పిట్టకథలన్నీ ఉద్దానం కిడ్నీరోగులకు ఎక్కలేదు. వేలాది మంది వారి భూములు, ఆస్తులు అమ్ముకుని డయాలసిస్ చేయించుకుని ఇల్లు, ఒళ్ళు గుల్ల చేసుకున్న వారంతా కనీసం ప్రతీనెలా పట్టెడు మెతుకులు తినేందుకు అవకాశం కలుగుతుందని, నెలవారీ మందులు కొనుగోలు చేసుకునేందుకు డబ్బులు ఉంటాయన్న ఆశతో కిడ్నీరోగులంతా వచ్చారు. వీరందరూ...ఆరోగ్యమంత్రి సభ ముగిసిన తర్వాత మళ్లీ జీవచ్ఛవంలా...మిగిలిపోయారు!!