శ్రీకాకుళం

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌పై గ్రామీణులకు అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 26: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు చైర్‌పర్సన్ అధ్యక్షతన ఆదివారం జరిగాయి. 1,4,7 స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరుగ్గా, మిగిలిన కమిటీలకు కోరం లేక వాయిదా వేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగాలని, గర్భిణులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను 102 ఫోన్‌కాల్‌తో ఏర్పాటు చేసిందన్నారు. గ్రామీణులు పూర్తిస్థాయిలో దీన్ని ఉపయోగించుకోవాలని, అందుకు తగిన అవగాహన గ్రామీణ ప్రజలకు కల్పించాలని ఆమె కోరారు. సాక్షరభారత్‌లో భాగంగా నోట్ పుస్తకాలు, పెన్నులు అభ్యాసకులకు సరఫరా చేశారా అని ప్రశ్నించగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని సాక్షరభారత్ ఉపసంచాలకుడు జి.కృష్ణారావు తెలిపారు. ఈసందర్భంగా వివిధ పద్దుల కింద వివిధ పనులకు మంజూరు చేసిన నిధులు, విడుదల చేసిన నిధులకు సభ్యులు ఆమోదం తెలిపారు. జెడ్పీ సిఇవో నగేష్; ఉప కార్యనిర్వహణాధికారి లక్ష్మీపతి, డిఎం అండ్ హెచ్‌ఓ తిరుపతిరావు, పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీరు కె.మురళీకృష్ణ, డిఇఓ సుబ్బారావు, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకుడు రోజారాణి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రి అచ్చెన్నకు సిఎం జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాకుళం, మార్చి 26: రాష్ట్ర కార్మిక శాఖామంత్రి కింజారాపు అచ్చెన్నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. రాజధానిలో మంత్రి అచ్చెన్న జన్మదిన వేడుకలకు పురస్కరించుకొని ఆదివారం అభిమానుల మధ్య కేక్‌కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న విపక్షాన్ని ఎండగట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు ఆశయసాధనే లక్ష్యంగా రాజకీయాలు నెరిపి శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సిఎం ఆకాంక్షించారు. ముఖ్యమంత్రితోపాటు అనేకమంది మంత్రులు అచ్చెన్నకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లానుంచి అభిమానులు ఈ వేడుకలకు హాజరయ్యారు.ఈ వేడుకల్లో సిఎంతోపాటు మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు ఎల్.రమణ పాల్గొని అచ్చెన్నకు శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ శుభాకాంక్షలు 0: మంత్రి అచ్చెన్నాయుడుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు నెరిపి అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అచ్చెన్నకు సూచించారు.