శ్రీకాకుళం

విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 28: విద్యార్థుల సేవలో రెవెన్యూ శాఖ అని జిల్లా సంయుక్త కలెక్టర్ కెవి ఎన్ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కుల, ఆదాయ, రెసిడెన్స్ ధ్రువపత్రాల జారీపై కళాశాల ప్రిన్సిపాల్స్, సంక్షేమ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస పత్రాల జారీ చేసేందుకు దరఖాస్తులు పాఠశాలలు, కళాశాలలోనే రేపటి నుంచి దరఖాస్తులను విద్యార్థులకు విక్రయించాలన్నారు. ఈ సర్ట్ఫికెట్లు ఎల్‌కెజి నుంచి పిజి వరకు చదివే విద్యార్థులు పొందవచ్చునని తెలిపారు. దరఖాస్తులు వెంటనే పూరించి పాఠశాలలు, కళాశాలలోనే అందజేయాలని, వారు మండలాల తహశీల్దార్‌లకు పంపించి విఆర్‌వోలతో పది రోజుల్లోనే విచారణ చేయించి ఆన్‌లైన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలకు సర్ట్ఫికెట్లు పంపిస్తారని, ఈ సర్ట్ఫికెట్లను పాఠశాల, కళాశాలవద్ద విద్యార్థులు పొందవచ్చునన్నారు. ఈ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభించి ఏప్రిల్ 20 నుంచి 30వతేదీ నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. సిసిఎల్‌ఎ ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. జీవో-25ను అనుసరించి శాశ్వత సర్టిపికెట్ల జారీ చేయబడుతుందన్నారు. సర్ట్ఫికెట్లపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంక్షేమ అధికారులు కళాశాలల ప్రిన్సిపాల్స్‌లకు ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు ముగిసేలోగా విద్యార్థుల నుంచి వివరాలు సేకరించడానికి దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. విద్యార్థుల్లో ఎవరికైనా దరఖాస్తులు అందకపోతే సమాచారం అందాలని, సర్ట్ఫికెట్లు జారీపై ప్రతి స్కూల్, కళాశాలల్లో నోటీసు బోర్డులో ఉండాలన్నారు. ప్రతి కేంద్రానికి ఉప తహశీల్దార్లను స్క్వాడ్లుగా నియమించామని, వారి ద్వారా పాఠశాలలకు పంపించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్డీవో దయానిధి తెలియజేశారు. అలాగే మధ్యాహ్న భోజనం, రేషన్ షాపుల ద్వారా విద్యార్థులకు దరఖాస్తులు అందజేస్తామని సంయుక్త కలెక్టర్ తెలిపారు. స్కూల్స్, కళాశాలల్లో విలువైన భూములు ఆక్రమాణలకు గురైతే సర్వే సంఖ్యలు తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, విశాఖ ఆర్డీవో దయానిధి, డిఇవో సుబ్బారావు, గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు రోజారాణి, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎఎస్ ప్రకాశరావు, డిఎస్‌డిఓ శ్రీనివాస్‌కుమార్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ప్రభుత్వం దృష్టికి హ్యాచరీ ఇబ్బందులు
ఎచ్చెర్ల, మార్చి 28: తీరప్రాంత గ్రామమైన డి-మత్స్యలేశం పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు స్థానికంగా ఉన్న హ్యాచరీ వలన కలిగిన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సిపిఎం రాష్ట్ర నాయకుడు ఎం.కృష్ణమూర్తి జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి స్పష్టంచేశారు. డి-మత్స్యలేశం పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాల్లో హ్యాచరీ కారణంగా ఎదురౌతున్న సమస్యలను మంగళవారం స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు కలుషితమైందని, క్యాన్‌ల ద్వారా మంచినీటి అవసరాలను తీర్చుకుంటున్నామన్నారు. వివిధ రోగాలు బారిన పడి స్థానికులు అనారోగ్యం పాలౌతున్నారని మత్స్యకార ప్రతినిధి మూగిరామారావు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. హ్యాచరీ మూయించాల్సిన అధికారులు ప్రజల మనోభావాలకు భిన్నంగా అనుమతులు జారీ చేయడం పట్ల ప్రభుత్వ తీరును సిపిఎం నేతలు తప్పుపట్టారు. హ్యాచరీ యాజమాన్యం తాగునీటి సమస్యను పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు స్థానికులకు అందించేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. అలాగే కుప్పిలి ప్రాంతంలో ఉన్న రొయ్యిల చెరువులు సాగును సిపిఎం నేతలు పరిశీలించారు. సమీపంలో ఉన్న వ్యవసాయ భూము లు నిస్సారవంతంగా తయారుచేసే విధంగా రొయ్యిలు సాగుచేసే వ్యాపారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరివెంట సిటు నాయకులు పి.తేజేశ్వరరావు, శ్యాంసుందరరావు పాల్గొన్నారు.