శ్రీకాకుళం

చెల్లింపులపై ఆర్థిక ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మార్చి 28: సమీక్షలు సమావేశాలు...టెలీ కాన్ఫరెన్స్‌లలో లక్ష్యాలు అధిగమించాలని, పౌరులందరికీ మెరుగైన అవినీతి రహిత పాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింహం వరకు ఆదేశాలు జారీ చేయడం సబబుగా ఉన్నా క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేసిన వారికి చెల్లింపులు జరపకుండా ఆర్థిక ఆంక్షలు పేరిట బ్రేకులు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆంక్షల కారణంగా జిల్లాలో కోట్లాది రూపాయలు చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రాధాన్యత అంశాలు పురోగతి నత్తనడకన సాగుతోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పురోగతికి ఆర్థిక ఆంక్షలు అడ్డుగా నిలిచాయి. ఫిబ్రవరి 6వతేదీ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నియామవళి పేరిట బాబు సర్కార్ ఆర్థిక ఆంక్షలకు శ్రీకారం చుట్టింది. అక్కడతో ఆగకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు ఈ ఆంక్షలను కొనసాగించింది. వీటి కారణంగా ట్రెజరీల నుంచి జీతాలు మినహా ఎటువంటి చెల్లింపులు లేకపోవడంతో పల్లె నుండి పట్టణం వరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు రూ.50కోట్లు వరకు చెల్లింపులు ఆర్థిక ఆంక్షల కారణంగా నిలిచిపోయినట్లు అధికారులే చెప్పుకొస్తున్నారు. వేసవి తీవ్ర రూపం దాల్చడంతో మంచినీటి పథకాలు, బోర్లు మరమ్మతులకు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేసిన జనరల్‌ఫండ్ 13-14వ ఆర్థిక సంఘం నిధులపై ఈ ఆంక్షలను వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా తాగునీరు వనరుల పునరుద్ధరణ, రహదారుల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాలు పూర్తికాకపోవడం, పారిశుద్ధ్య పనులు అర్థాంతరంగా నిలిచిపోవడం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పనులు పూర్తిచేసిన ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు బిల్లులు చెల్లింపులు జరగక దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మినహా మిగిలిన అన్ని లావాదేవీలపై ఫ్రీజింగ్ ప్రభావం తీవ్రంగా పడింది. విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్‌ఛార్జీలు, ఉపకార వేతనాలు, ఫీజు రీ-యింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై కూడా ఆంక్షలు కొనసాగించడం వల్ల వారంతా నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేసవి సెలవులు రావడంతో వసతి గృహాలకు బకాయిలు చెల్లింపులు జరపకపోవడం ఉన్నత చదువులు సాగిస్తున్న విద్యార్థులు ఒకింత ఆర్థిక సమస్యలు ఎదుర్కొక తప్పడం లేదు. ఒకవైపు లక్ష్యాలు అధిగమించాలని అధికారులకు సిఎం నుండి కలెక్టర్ వరకు హుకుం జారీ చేయడం మరోవైపు ఆర్థిక ఆంక్షలు నెత్తిన రుద్దడంతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పాఠశాలల అదనపు భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి యాజమాన్య కమిటీల చైర్మన్లు బిల్లుల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై నిర్మాణాలు పూర్తి చేస్తే చెల్లింపులపై ఆర్థిక ఆంక్షలు పేరిట బిల్లులు నిలిపివేయడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి ట్రెజరీ చెల్లింపులపై ఆంక్షలు కొనసాగించడాన్ని అధికార పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం, వౌళిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రసంగాలు చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేయాలన్న సంకల్పం బాబు సర్కారుకు లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆంక్షల కారణంగా ఉద్యోగులు పిఎఫ్, వేతనంతో కూడిన సెలవులకు సంబంధించిన మొత్తాన్ని కూడా పొందే అవకాశం లేకుండా పోతుందని ఆయా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు వారివారి వ్యక్తిగత అవసరాల కోసం పై రెండింటినీ వినియోగించుకోవాలని ప్రణాళిక వేసుకున్నప్పటికీ ఆర్థిక ఆంక్షలు ఫలితంగా డబ్బులు చేతికి అందకపోవడంతో వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్న బాధ వారిలో వ్యక్తం అవుతుంది. ప్రజాప్రతినిధులు, ధికారులు ఆర్థిక ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేస్తారా? అన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు శతశాతం అధిగమించేందుకు దోహదపడే వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలు ఊపందుకునేలా ఆంక్షలు ఎత్తివేసి ఎప్పటిలాగే చెల్లింపులు జరపాలని పలువురు కోరుతున్నారు.