శ్రీకాకుళం

టిడిపి విధానాలను తిప్పికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 1: ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా వైఫల్యం చెందారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ,గురువారం బూత్‌కమిటీల సమావేశాలు నిర్వహించడంలో భాగంగా మండలంలోని తమ్మినాయుడుపేట, పూడివలస కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కిరణ్‌కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతిని తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పెట్టి కార్యకర్తలకే ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. ఏ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరగడం లేదని ఆ పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. అర్హులకు పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు సిఫార్సులకు పెద్దపీట వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. నారాయణపురం ఆధునీకరణ, నాగావళి కరకట్టలు అనేక గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు, రోడ్లు హామీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని, ఈ విషయాలను ప్రజలకు వివరించి జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేలా కేడర్ కృషి చేయాలన్నారు. బూత్‌కమిటీలు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సనపల నారాయణరావు, జరుగుళ్ల శంకరరావు, సనపల సూరిబాబు, రామచంద్రరావు, దివాకర్, శ్రీరాములు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

పట్టణ పేదలకు పక్కా ఇళ్లు
* ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం(రూరల్), మే 1: పట్టణ పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశ్యంతో పట్టణంలో ఇల్లు నిర్మాణం ప్రారంభించామని ఎమ్మెల్యేగుండ లక్ష్మీదేవి సోమవారం తెలిపారు. హుదూద్ తుపాన్‌కు సంబంధించి 192 ఇళ్లు నిర్మాణం కాగా, అదనంగా 1280 ఇళ్లు కట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవినీతి లేకుండా పేదలకు ఇళ్లు పంపిణీ చేయడమే తమ అభిమతం అన్నారు. హూదూద్ ఇళ్లు 192 నిర్మించి వౌలిక సదుపాయాల నిర్మాణ దిశగా పయనిస్తున్నామని ఈ గృహ నిర్మాణానికి ఆ స్థలంలో ఉన్న 30 ఇళ్లు ఖాళీ చేయించిన సందర్భంలో వాళ్లకు ఆ ఇళ్లు కేటాయిస్తామని, నాగావళి నదిపై వంతెన నిర్మాణం వేగవంతంగా చేయించేందుకు త్రోవకు అడ్డుగా ఉన్న ఆరిళ్లు తొలగించిన సందర్భంలో ఆ కుటుంబాలకు ఇళ్ల మంజూరుతోపాటు నాగావళి నదిలో ఇద్దరి చిన్నారులు పడి మృతి చెందిన సందర్భంలో వారి కుటుంబాలకు రెండు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఇంకా ఎవరికి ఇళ్లు కేటాయించలేదని, ఈ కేటాయింపుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కూడా ఈవిషయంలో మోసపోకూడదని కోరారు.
* ధర్మారావు మృతికి సంతాపం
సాహితీవేత్త దూసి ధర్మారావు మృతిపట్ల ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ తన సంతాపాన్ని తెలియజేశారు. ధర్మారావు దుర్మరణం తమకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఇది జిల్లాకు ఎంతో లోటని, అటువంటి మానవీయుని పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి కలుగజేయాలని కోరుతూ వారి కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలిపారు.