శ్రీకాకుళం

ముగిసిన ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఎచ్చెర్ల, ఏప్రిల్ 29: ఇంజనీరింగ్, మెడిసన్, అగ్రికల్చరల్ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థి జీవితంలో ఎంసెట్ ఎంతో కీలకమైనది. జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 11 కేంద్రాల్లో జరిగింది. మధ్యాహ్నం మెడిసన్ ప్రవేశ పరీక్ష ఐదు కేంద్రాల్లో నిర్వహించారు. ఇంజనీరింగ్ పరీక్షకు 6015 మంది దరఖాస్తు చేసుకోగా 5328 మంది పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఐదు కేంద్రాల్లో నిర్వహించిన మెడిసన్, వ్యవసాయ ప్రవేశ పరీక్షకు 2162 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2028 మంది పరీక్ష రాశారు. ఉదయం నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు పది గంటల తరువాత వచ్చిన విద్యార్థులను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యగా 144 సెక్షన్ విధించారు. జిల్లా అధికారులు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు. జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎంసెట్ పరీక్షను పర్యవేక్షించేందుకు జె ఎన్‌టియు నియమించిన ప్రత్యేక పరిశీలకులు జిల్లాకు చేరుకుని పర్యవేక్షించారు. కేంద్రాల్లో సీనియర్ లెక్చరర్లనే అబ్జర్వర్లుగా నియమించారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్‌లుగా వ్యవహరించారు. ఇంజనీరింగ్ పరీక్ష ప్రభుత్వ పురుషులు, మహిళా డిగ్రీ కళాశాలల్లో, గాయత్రీ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్, గాయత్రీ పిజి కళాశాల(మునసబుపేట), ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, శారదా ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(అంపోలు), వైష్ణవి ఇంజినీరింగ్ కాలేజ్(సింగుపురం), వెంకటేశ్వర విద్యా సంస్థలు( ఎచ్చెర్ల), శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల( ఎచ్చెర్ల), మెడిసన్ పరీక్ష విభాగానికి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల, మహిళా డిగ్రీ కళాశాల, శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో(చిలకపాలెం)లో పరీక్ష జరిగింది. పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులు హాట్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఉచిత బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు.
విద్యార్థులకు తాగునీరు, మజ్జిగ, పులిహారపొట్లాలను అదించేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.
అభ్యర్థులకు శివానీ యాజమాన్యం బస్సులు
ఎచ్చెర్ల: ఎంసెట్ అభ్యర్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా శ్రీశివానీ విద్యాసంస్థల యాజమాన్యం బస్సులను సమకూర్చింది. వీరితోపాటు వచ్చిన తల్లిదండ్రులకు కళాశాల ఆవరణలో టెంటులు ఏర్పాటు చేసిన సేద తీర్చుకునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. సత్యసాయి సంస్థలు ఈ కేంద్రాల వద్ద మంచినీరు, మజ్జిగ సరఫరా చేసింది. శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎ కేంద్రంలో 500మంది పరీక్ష రాయాల్సి ఉండగా 57 మంది గైర్హాజరయ్యారు. బి సెంటర్‌లో 500మందికి 62మంది హాజరు కాలేదు. ఎస్‌ఎస్‌ఐటిలలో 515 మందికి 55 మంది గైర్హాజరయ్యారు. వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో 500 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 433 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కేంద్రంగా 300 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 29 మంది హాజరు కాలేదు. మధ్యాహ్నం నిర్వహించే మెడిసిన్ ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్ పరీక్షకు శివానీ ఎ కేంద్రంలో 450 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారు. బి సెంటర్‌లో 400మందిలో 22 మంది హాజరు కాలేదు. ఎస్ ఎస్‌ఐటిలో 413 మందికి 29మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎంసెట్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.