శ్రీకాకుళం

కష్టాల్లో అన్నదాతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: ఆరుగాలం శ్రమించే అన్నదాతలను కష్టాలనుంచి గట్టేక్కించడంలో పాలకులు వెనుకపడ్డారు. నాడు చంద్రబాబు వ్యవసాయం దండగని అధికారానికి దూరమైన నిజాన్ని ఆలస్యంగా గుర్తించి గత ఎన్నికల వేళ రుణమాఫీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రుణమాఫీ రైతు కుటుంబాలను ఆదుకోకపోవడమే కాకుండా బ్యాంకుల వద్ద వారి పరపతిని కూడా దెబ్బతీసింది. ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వడ్డీలేని రుణం తీసుకొని తిరిగి చెల్లించుకునే సాంప్రదాయం అనేక మంది రైతులకు ఉండేది. రుణమాఫీ హామీపై ఆశలు పెంచుకొన్న పలు కుటుంబాలు నేటికీ వ్యవసాయ రుణాలు తిరిగి లభించని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 2.94 లక్షల మంది రైతులు పంట రుణాలు బ్యాంకులనుండి పొందినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో మొదటి విడత రూ.600 కోట్లు రుణమాఫీ సంబంధిత రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసి ఎంతో ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. మొదటి విడతలో 20 శాతం మంది రైతులే లబ్ధిపొందినట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. రెండవ విడత రుణమాఫీ కూడా సుమారు 1.35 లక్షలమంది రైతులకు కేవలం రూ.90 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ఏమాత్రం రైతులకు రుణమాఫీ విముక్తి కలిగించలేదన్న బాధ ఆ కుటుంబాలు వ్యక్తం చేస్తున్నాయి. కూలి రేట్లు, పురుగు మందులు, ఎరువులు, దుక్కుల ధరలు పెరగడంతో ఎకరా సాగు చేయాలంటే కనీసం రూ.30 వేలు మదుపు పెట్టాల్సి ఉంటుందని, బ్యాంకులు మాత్రం ఆ స్థాయిలో రుణం ఇవ్వడం లేదన్న బాధ పాలకుల వద్ద అనేక సందర్భాల్లో ఎకరువు పెట్టుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు. అదే బ్యాంకు నుండి ప్రతీ ఏటా రుణం పొందుతున్నప్పటికీ పట్టాదారు పాస్‌పుస్తకాలు, 1బి, అడంగల్ ప్రతులు తప్పనిసరి అని అధికారులు మెలికి పెట్టడం రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. కొత్తగా రుణాలు పొందాలంటే వివిధ బ్యాంకుల్లో రుణం లేదని ఓ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కౌలు రైతులకు రుణం అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో సుమారు 50వేల మంది కౌలు రైతులు ఉన్నప్పటికీ కేవలం 3700మందికి మాత్రమే గుర్తింపు కార్డులు అధికారులు జారీ చేశారు. వీరందరికీ రుణం బ్యాంకు నుండి అందివ్వని పరిస్థితి ఆ కుటుంబాలను అప్పుల ఊబిలోనికి నెట్టేసింది. కౌలు రైతు పంటరుణం పొందాలంటే సంబంధిత భూ యజమాని అనుమతి తప్పనిసరి అని బ్యాంకులు మెలిక పెట్టడంతో రుణ లక్ష్యంగా వీరికి దక్కకుండా పోతుంది. మద్దతు ధర అందుకోవాలని ఖరీఫ్‌లో సాగు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు రైతులు చేరవేసినప్పటికీ నేటికీ చెల్లింపులు ప్రభుత్వం జరపక పోవడం వారంతా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇదిలా ఉండగా రబీలో పండించిన ధాన్యం కూడా కొనే నాధుడే కరువయ్యాడు. దళారులకు కొనే ఆర్థిక స్తోమత లేక మిల్లర్లు ప్రభుత్వం ఇతర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించే సదుపాయం కల్పించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని దాటవేస్తున్నారు. అపరాల విషయానికి వస్తే పంట కలిసి వచ్చింది కానీ అమ్మకాలు పూర్తయిన తరువాత ధర ఆకాశాన్ని అంటడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్వింటా మినుములను రూ.7,200 లకు రైతు విక్రయించగా వీటి ధర రూ.9,700లకు పెరిగిపోవడం, పెసలు రూ.5,700 ధర పలకడం ఎంతో నష్టపోయామని అపరాల సాగు చేసే రైతులు వాపోతున్నారు. ఇలా ధరలు స్థిరీకరణ పై కూడా ప్రభుత్వం శ్రద్ధ కనబరచడం లేదన్న ఆవేదన రైతు కుటుంబాల్లో అధికంగా ఉంది. ఇటువంటి ప్రత్యేక సమస్యలపై దృష్టిసారించి అన్నదాతలను ఆదుకోకుంటే బాబు ప్రభుత్వం అప్రతిష్ఠ పాలయ్యే ప్రమాదం లేకపోలేదు.