శ్రీకాకుళం

కలిసి పని చేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 18: జిల్లా రాజకీయాల్లో సాధారణంగా ఎక్కడ సభ జరిగినా..సమీక్షలు నిర్వహించినా..పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ మాత్రం శివాలెత్తడం ఆయనకు అలవాటు. కాని - సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ బహిరంగ సభ, ప్రారంభోత్సవాలు, రోడ్డు షో ఫుల్ జోష్ కలగడంతో శివాజీలో సంతోషం కన్పించింది! ఆయన కంటిలో నీరు కదలికలు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చిందంటూ తానే స్వయంగా సభలో పలాస నియోజకవర్గం ప్రజలకు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఎప్పుడూ చమత్కారాలు..చమక్కులు..చీవాట్లు..సీదరింపులతోపాటు ఎంతటి పెద్దాయన సభ అయినా అలకతో వెనుదిరిగే సాధాగా మెలిసి పనిచేసేందుకు దృఢమైన నిర్ణయం తీసుకున్నట్టు లోకేష్ వెల్లడించారు. ముఖ్యంగా మూడో తరం కదిలి వచ్చింది!! అంటూ లోకేష్ - రాముల కలయుక సిక్కోల్ గడ్డ నుంచి రాష్ట్రంలో గల మూడో తరం నాయకత్వానికి ఒక సంకేతాన్ని ముఖ్యమంత్రి తనయుడు ఇవ్వడంతో యువతరంగం కేరింతలతో బహిరంగసభ దద్దరిల్లిపోయింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి తనయుడు పాలనాదక్షతకు వారసత్వపు వాసనలు ఇప్పటి నుంచే సీనియర్లు కిమిడి కళావెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, పితాని సత్యన్నారాయణ వంటి మంత్రులు సైతం వెల్లకక్కుతుంటే - భవిష్యత్తు రాజకీయాలపై మూడో తరం ప్రభావం బలంగా పనిచేస్తుందంటూ పలాస వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు లోకేష్ చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.

తెలుగుతమ్ముళ్ల జోష్
పలాస, సెప్టెంబర్ 18: తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో ఉన్న నిస్తేజాన్ని తొలగించేందుకు పంచాయతీరాజ్‌శాఖ, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మొదటిసారిగా పలాసకు తీసుకురావడంలో సఫలం కావడంతోపాటు క్యాడర్‌లో నూతన ఉత్తేజం తీసుకువచ్చిందని చెప్పవచ్చు. పలాస జిజెకాలేజి క్రీడామైదానంలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేసినప్పటికి తరలివచ్చిన ప్రజానీకానికి ఆ బహిరంగ ప్రాంగణం చాలకపోవడంతో బయట నుంచే మంత్రులు ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. దాదాపుగా 8 వేల నుంచి 10 వేల జనాభా వస్తారని అంచనాలు వేసినప్పటికి అంతకుమించి రావడంతో తెలుగుదేశం నాయకులు ఉబ్బితబ్బైపోయారు. ఉదయం 10 గంటలకు చిన్నపాటి వర్షం కురుస్తుండడంతో సభ ఫెయిల్ అవుతుందని నిరాశ చెందిన తెలుగుతమ్ముళ్లుకు నారా లోకేష్ వచ్చిన సమయానికి పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు జనసంద్రంగా మారడంతో ఎమ్మెల్యే శివాజీ రెట్టింపు ఉత్సాహంతో ఉత్సాహభరితంగా నడిపారు. దేశం నాయకుల పకడ్బందీ వ్యూహాంతో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కార్యకర్తలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు చేకూర్చి శెభాష్ అనిపించుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కృష్ణంరాజు గడిచిన రెండు రోజులుగా సభాప్రాంగణంతోపాటు ఇతర కార్యక్రమాలు ఒంటిచెత్తితో నడిపించడంతో ఎమ్మెల్యే సైతం ఆయన పనితీరుకు మెచ్చుకున్నారు.
భగ్నం
హిరమండలం, సెప్టెంబర్ 18: వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకోవడానికి సిపిఎం నాయకులు చేసిన ప్రయత్నాలు పోలీసులు భగ్నం చేశారు. సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంశధార రిజర్వాయర్ మూలంగా ముంపునకు గురైన గ్రామాల నిర్వాసితుల సమస్యలను పక్కన పెట్టి ప్రాజెక్టు పనులను చేపట్టడంపై సిపిఎం నాయకులు ప్రణాళికలు రూపొందించారు. పోలీసు బలగాలతో నిర్వాసితులను భయకంపితులను చేసి కేసులు బనాయించడంతో పాటు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వంశధార రిజర్వాయర్ పనులు అడ్డుకోవడానికి సిపిఎం సోమవారం నాయకులు నిర్ణయించారు. దీంతో పోలీసులు కూడా బలగాలను మోహరింప చేశారు. నిర్వాసిత గ్రామాలకు వెళ్లే రహదారులపై పోలీస్ బలగాలను మోహరించారు. గార్లపాడు రహదారికి సంబంధించి ఎబి రహదారిలోని వంశధార కుడి ప్రధాన కాలువ సమీపం వద్ద పాడలి గ్రామానికి వెళ్లే జంక్షన్ వద్ద గొట్టాబ్యారేజ్ జంక్షన్ తదితర ప్రాంతాలతో పాటు తహశీల్దార్ కార్యాలయం వద్ద పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. సిపిఎం నాయకులు గొట్టాబ్యారేజ్ జంక్షన్ వద్ద చేపడుతున్న స్పిల్ వే పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బవిరి కృష్ణమూర్తి, తిరుపతిరావు, కోరాడ నారాయణరావు మరికొంతమంది నాయకులు పనులను అడ్డుకోవడానికి వస్తుండగా పోలీసులు గొట్టాబ్యారేజ్ జంక్షన్‌వద్ద అదుపులోకి తీసుకొని పాతపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 14 మందిని అదుపులోకి తీసుకోగా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో 21 మంది వరకు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.
పాలకొండ ఇన్‌చార్జి డి ఎస్‌పి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పాతపట్నం, పాలకొండ సిఐలు ప్రకాశరావు, సూరునాయుడు పోలీసు బందోబస్తు నిర్వహించారు.
రుణమాఫీపై బహిరంగ చర్చకు రండి
సారవకోట, సెప్టెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని ప్రతిష్టాకరంగా చేపట్టిందని అర్హులైన ప్రతీ ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా రుణాలను మాఫీ చేసిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టంచేశారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని బుడితి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాన్ని చేస్తున్నాయని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్న గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి నాయకుల కుటుంబాలకు టిడిపి చేపట్టిన రుణమాఫీ వివరాలను బహిరంగ వేదికపై వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టిడిపి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ప్రతిపక్ష నాయకులు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డికి మతి భ్రమించిందని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో పెద్దలను కూడా గౌరవించకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఆయన సోదాహరణంగా వివరించారు. గ్రామీణ ప్రజలకు సేవచేసేవిధంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా దేశంలోనే చిన్నవయస్సులో భాద్యతలు చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి లోకేష్ వివరించారు. తన పరిధిలో ఉన్న ఐటీ శాఖ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ అదే సమయంలో ఉత్పాదకరంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు 2019లో పూర్తిస్థాయిలో తాగునీరు అందించడానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని సభాముఖంగా ప్రకటించారు. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాను దత్తత తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాష్టమ్రంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, పితాని సత్యన్నారాయణ, కళావెంకటరావు తదితరులు ప్రసంగించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సాదు చిన్నికృష్ణంనాయుడు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, జిల్లా అద్యక్షురాలు గౌతు శిరీష, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుండె గుండెకు మోదీ కార్యక్రమం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 18: ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి బిజెపిని బలోపేతం చేసేందుకు గుండె గుండెకు మోదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టంచేశారు. సోమవారం చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు పంచాయతీ భవనాలు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బాట పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ‘మోదీ మాట చంద్రన్న బాట’ని వాటిని మార్పు చేయాలని తాము కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలోమార్పు రాలేదన్నారు. 175 నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతీ కమిటీకి ఐదుగురు సభ్యులు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. గతంలో సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉండేదని మోదీ ప్రభుత్వం నేరుగా అకౌంట్‌లకే నిధులు జమ చేస్తుందన్నారు. 32 శాతం నుండి 42 శాతానికి నిధులు కేటాయింపులు పెంచిందని వివరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 90 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులే కేటాయిస్తుంటే వీటితో గ్రామాల్లో అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. వచ్చే నెల 4న జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టంచేశారు. స్వచ్ఛ్భారత్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానిదైనా సిఎం చంద్రబాబు మున్సిపల్ శాఖామంత్రి నారాయణ ఫోటోలతో ప్రచారం చేస్త్తున్నారని కనీసం ప్రధాని మోదీ ఫోటో కూడా ముద్రించడం లేదని ఆక్షేపించారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌కు అమృత పథకం కింద రూ.60 కోట్లు కేంద్ర ప్రభుత్వమే కేటాయించిందన్నారు. భావనపాడు పోర్టు నిర్మాణంతో పాటు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటయ్యేలా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ మత్స్యకారుల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పైడి వేణుగోపాలం, కిసాన్ మోర్చా రాష్ట్ర అద్యక్షులు పూడి తిరుపతిరావు, జిల్లా అధ్యక్షులు కోటగిరి నారాయణరావు, దుప్పల రవీంద్రబాబు, శవ్వాన ఉమామహేశ్వరి, సంపతిరావు నాగేశ్వరరావు, గొద్దు భాగ్యలక్ష్మీ, సువ్వారి వెంకటసన్యాసిరావు, మారుపెల్లి నారాయణరాజు, పతివాడ పైడినాయుడు, తమ్మినేని గోవిందరావు, పేడాడ జనార్దనరావు, పైడి సత్యం తదితరులు ఉన్నారు. తొలుత బూత్ కమిటీలు చురుకైన పాత్ర పోషించాలని ఎచ్చెర్ల, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాల కేడర్‌తో వీర్రాజు చర్చించారు. మోదీ పథకాలు ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.

‘నిర్వాసితులను మోసగిస్తున్న సర్కార్’
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 18: వంశధార నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా మోసం చేస్తుందని సిటు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, కెవిపి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేశ్ విమర్శించారు. వంశధార నిర్వాసితులు పోరాటం కోసం ప్రైవేటు వాహనంలో వెళ్తుండగా పోలీసులు కొత్తరోడ్డు వద్ద అక్రమంగా అరెస్ట్ చేసి రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కెవి పి ఎస్ జిల్లా కార్యదర్శి గణేష్‌ను ఉదయం 8గంటలకే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్భందాలు, అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలు ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వంశదార నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా అక్రమంగా ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగ విరుద్దమని ఆరోపించారు. వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పునరావాసం కల్పించిన తరువాత ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిరమండలం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్భందాన్ని ఎత్తివేయాలన్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

టిడిపి పాలనలో విద్యకు పెద్దపీట
మందస, వజ్రపుకొత్తూరు, సెప్టెంబర్ 18: తెలుగుదేశం ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసి విద్యార్థులకు ప్రభుత్వ రాయితీలు కల్పించి ఐటి రంగంలో ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని పంచాయితీరాజ్, ఐటి మంత్రి నారా లోకేష్ అన్నారు. పలాస మున్సిపాలిటీ పరిధి మార్కెట్ యార్డులో నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరియు గ్లో సంస్థ ఆధ్వర్యంలో 550 బెంచిలను సోమవారం మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావి తరాలకు శాస్త్ర, సాంకేతిక విద్యను అందించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించి అన్ని రంగాల్లోనూ విద్య ముందుండే విధంగా టిడిపి పాలనలో సి ఎం చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టి విద్యకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బాలికా విద్యకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పితాని సత్యనారాయణ, విద్యుత్‌శాఖామంత్రి కె.కళావెంకటరావు, రవాణామంత్రి కె.అచ్చెనాయుడు, ఎంపి కె.రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, జిల్లా టిడిపి అధ్యక్షురాలు గౌతు శిరీష, ఎమ్మెల్యేలు బి.అశోక్, కె.వెంకటరమణ, డి ఈవో ప్రభాకరరావు, ఎం ఈవోలు పాల్గొన్నారు.