శ్రీకాకుళం

రెండేళ్ళలో జిల్లా అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్టప్రంచాయితీ రాజ్, ఐ.టి శాఖామంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం స్థానిక రహదారులు, భవనాల శాఖ అతిధిగృహం వద్ద మీకోసం ప్రజా సమస్యల పరిష్కారవేదికను నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాల నుండి వచ్చిన మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచ్‌లు ఆయాగ్రామ పంచాయతీ పరిధిలో గల పలు సమస్యలు గురించి వినతిపత్రాలను మంత్రికి సమర్పించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి సమీక్షను స్పష్టంగానిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింద పనిచేస్తున్న పనివారలకు దినసరి వేతనం కొన్ని జిల్లాలలో రూ.165లవచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్థాయిలో సక్రమంగా విధులు నిర్వహించి దినసరి వేతనాన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ శాఖలద్వారా చేపడుతున్న రహదారి పనులను రానున్న 9 మాసాల్లో పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ నిధులతో పాటు స్టేట్‌గ్రాంట్ నుండి వచ్చిన నిధులను క్రోడీకరించి వెనుకబడి ఉన్న శ్రీకాకుళం జిల్లాను అభివృద్ది పరచడానికి ప్రజా ప్రతినిధులతో చర్చించి ప్రణాళికను తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇందన శాఖా మంత్రి కిమిడి కళావెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, మండల పరిషత్ అధ్యక్షులు , జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్యున్ని దర్శించుకున్న లోకేష్
శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 19: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అరసవల్లిలో వేంచేసియున్న ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణస్వామిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, ఐటీ శాఖామంత్రి నారా లోకేష్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇవో శ్యామలాదేవి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. అనివెట్టి మండపంలో స్వామివారి శేషవస్త్రాలను, తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. స్వామివారి చిత్రపటాన్ని మంత్రి లోకేష్‌కు అందజేశారు. మంత్రి వెంట ఎంపి రాష్ట్ర మంత్రులు కిమిడి కళావెంకటరావు, జెడ్పి చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టిడిపి జిల్లాఅధ్యక్షురాలు గౌతుశిరీష, టిడిపి మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, టిడిపి నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.