శ్రీకాకుళం

టిడిపి హయాంలోనే సిసి రోడ్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 21: టిడిపి హయాంలోనే సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి అన్నారు. ఇంటింటికీ టిడిపిలో భాగంగా గురువారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ వార్డు పాతశ్రీకాకుళం దళితవాడలో డివిజన్ ఇంఛార్జ్ బైరి రాధాదేవి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయాంలోనే పక్కా గృహాలు ఇవ్వడం జరిగిందని స్పష్టంచేశారు. సమస్యలు తెలియజేస్తే ఈ సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రికి చెప్పడం జరుగుతుందని స్పష్టంచేశారు. మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ అసత్యను సత్యం కాదని సత్యం అసత్యంగా మారదని అయితా అసత్యం వేగం ఎక్కువగా ఉంటుందని సత్యంతే అంతిమవిజయమన్నారు. పట్టణ ప్రజానీకం అనుగుణంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి అనంతరం ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు చేపట్టిన ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. గంగునాగేశ్వరరావు, శివప్రసాద్, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిన్నారావు, దేవయాని, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీచక్రాపురంలో ఘనంగా శరన్నవరాత్రులు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆశ్వియుజ శుద్ధ పాఢ్యమి రోజున శ్రీచక్రాపుర వాసిని అయిన రాజరాజేశ్వరి దేవిని వెండి, పట్టు పలు పూలతో అమ్మవారిని పీఠాధిపతి బాలభాస్కరశర్మ అలంకరించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశప్రతిష్ఠ, యాగశాల ప్రవేశం, హోమగుండ ప్రజ్వలన, యాగశాలలో నాలుగు దిక్కులకు కలశప్రతిష్ఠాపన, బాలభాస్కరశర్మ దంపతులచే అరసవల్లి శ్రీచక్రాపుర పీఠ రుత్వికులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ప్రవేశం చేశారు. విచ్చేసిన భక్తులతో కుంకుమార్చనలు, బాలపూజలు పీఠాధిపతి స్వయంగా చేయించారు. మన్యుప్రత్యంగరి, గణపతి ప్రతిష్ట, దేవీ పంచాయతన హోమాలు నిర్వహించారు. ప్రతీ రోజూ 9మంది సువాసినీలకు సువాసినీ అర్చనలు సాగిస్తారు. శుక్రవారం నుండి శ్రీచక్రమేరువుల వద్ద కుంకుమార్చనలు 9:30గంటలకు ప్రారంభవౌతాయని వేకువజామున 4 గంటల నుంచి శ్రీచక్రార్చన పీఠాపది మూలవిరాట్‌కు చేయడం జరుగుతుందని వివరించారు. కుంకుమార్చనలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులతో రావాలని కోరారు. అలాగే మండల కేంద్రమైన ఎచ్చెర్లలో శరన్నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని స్థానిక మాజీ సర్పంచ్ జరుగుళ్ల శంకరరావు ఆధ్వర్యంలో మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. చిలకపాలెం కేంద్రంగా లారీ యజమానుల సంఘం ప్రతినిధులు అప్పలరాజు, పోలయ్యల పర్యవేక్షనలో శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. కుశాలపురం గ్రామంలో సూర శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు భవానీ భక్తులు మాలాధారణ, అమ్మవారికి పూజలు ప్రారంభించారు. అదే గ్రామానికి దుర్గామల్లేశ్వర ఆలయ సన్నిధిలో ఆలయ ధర్మకర్త కంచరాన రాజారావు నేతృత్వంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొయ్యిరాల కూడలి వద్ద జై భవానీ మహేశ్వరి ఆలయం వద్ద ఘనంగా శరన్నవరాత్రులు, భవానీ మాలాధరణ కార్యక్రమాలు ప్రారంభించారు.