శ్రీకాకుళం

గురజాడ బాట వెలుగు తోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), సెప్టెంబర్ 21: గురజాడ బాట వెలుగు తోట అని వక్తలు పేర్కొన్నారు. గురజాడ అధ్యయన వేధిక ఆధ్వర్యంలో స్థానిక విద్యాధరి డిగ్రీ కళాశాలలో గురువారం గురజాడ 155వ జయంతి కార్యక్రమం జామి భీమశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు సురంగి మోహనరావు, గీతాశ్రీకాంత్ ఫౌండేషన్ అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా, అంబేద్కర్ వర్శిటీ పాలకమండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, రచయిత్రి పట్టి సుమతీ, నిక్కు హరిసత్యన్నారాయణ, ఎస్వీ రమణమాదిగలు గురజాడ గొప్పతనాన్ని వివరించారు. గురజాడ రచనలు నేటికీ ప్రజాదనంలో ఉన్నాయంటే ఎంతో స్ఫూర్తివంతమైన చైతన్యవంతమైన సమాజం కోసం చేసిన కృషి అభినందనీయమన్నారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి
సారవకోట, సెప్టెంబర్ 21: ప్రపంచంలో అత్యున్నతమైన హిందూ సంస్కృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని విశ్వహిందూ పరిషత్ జిల్లా విభాగా కార్యదర్శి సింహాద్రి ఫల్గుణరావు పిలుపునిచ్చారు. స్థానిక త్రైలోకేశ్వర ఆలయం ప్రాంగణంలో గురువారం జరిగిన మండల విశ్వహిందూపరిషత్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతికి సంబంధించి ఆహారము, భాష, వేషాధారణ,ప్రవర్తన ప్రత్యేకతను సంతరించుకుందని నేడు ఈ సంస్కృతిలో విదేశీ సంస్కృతి చోటు చేసుకోవడం వలన ప్రమాదకర పరిస్థితులు ఎదురౌతున్నాయని ఆదేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంచేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం కొంతమంది దౌర్భాగ్య పరిస్థితులను చాటిచెబుతుందని విమర్శించారు. విశ్వహిందూ పరిషత్ గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తుందని అన్ని వర్గాలు కులాలను ఏకథాటిపైకి తేవడానికి తమవంతు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా మండల విశ్వహిందూ పరిషత్ బాధ్యతలను స్థానికుడైన సారవకోట అప్పారావుకు అప్పగించినట్లు ప్రకటించారు. ఈసమావేశంలో ధర్మాచార్యప్రముఖ బగాది రామారావు, జిల్లా సహకార్యదర్శి గేదెల మోహనరావు, స్థానిక కార్యదర్శి సిద్ధయ్య, నియోజకవర్గం ప్రతినిధి రామజోగిశర్మ, స్థానిక ప్రతినిధులు వాన ఎర్రయ్య, రావాడ వెంకటరమణ, సారవకోట అప్పారావు, మండాగురిటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.