శ్రీకాకుళం

నగర పంచాయతీ కార్యాలయానికి కరెంట్ కట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), ఏప్రిల్ 29: విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో స్థానిక నగర పంచాయతీ కార్యాలయానికి విద్యుత్‌శాఖాదికారులు శుక్రవారం కరెంట్ కట్ చేశారు. దీంతో నగర పంచాయతీ కార్యాలయంలో ప్రజా సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో వేసవి ఎండలకు సిబ్బంది కూడా కార్యాలయంలో పని చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని నగర పంచాయతీ అధికారుల వద్ద ప్రస్తావించగా మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు రూ.78 లక్షలు బకాయిలు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ ఎఇ హరికృష్ణ వద్ద ప్రస్తావించగా నగర పంచాయతీ విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు సరఫరా నిలుపుదల చేశామన్నారు.

పని చేయలేకపోతే ఉద్యోగం మానేయండి
ఇచ్ఛాపురం, ఏప్రిల్ 29: విధులను సక్రమంగా నిర్వహించలేని అధికారులు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మినృసింహం అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, నీటి పారుదల, మత్స్యశాఖ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న ప్రజలకు సేవలు అందించకపోతే ఏలాగని నిలదీసారు. ఎమ్మెల్యే బి.అశోక్ మాట్లాడుతూ విద్యుత్తు శాఖ డిఇ ప్రసాద్ తాను చెప్పిన పని ఒక్కటీ కూడ చేయలేదని ఆగ్రహంగా చెప్పడంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారన్నారు. లక్షన్నర జీతం తీసుకుంటున్నారు, అయినా ఎందుకింత నిర్లక్ష్యం, సరిగ్గా విధులను నిర్వహించలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా ఇ ఇ రవీంద్రను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్లు ద్వారా సరఫరా చేయాలని, 106 చెరువులో చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలని ఫిషరీస్ ఎడి శైలానాయక్‌ను ఆదేశించారు. ఇచ్ఛాపురంలో ఒడియా బాలికలు కోసం ప్రత్యేక కెజివిబి ఏర్పాటుకు ప్రతిపాదన చేయాలని ఆర్‌వి ఎం పివో త్రినాధ్‌కు ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రైవేట్ స్పెషలిస్టు డాక్టర్లు సేవలు వినియోగించుకునేందుకు ఫైల్ సిద్దం చేయాలని డి ఎం అండ్ హెచ్ వో శ్యామలదేవికి చెప్పారు. నియోజకవర్గంలో 50 వేల ఇంకుడుగుంతల తవ్వాలని డుమా పిడిని ఆదేశించారు. అంగన్‌వాడీలు, పంచాయతీ కార్యాలయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని, దీనికి అవసరమైన స్థలాలు సేకరించాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సిపివో శివరాంనాయక్, హౌసింగ్ ఇఇ గణపతి, ట్రాన్స్‌కో ఇఇ లక్ష్మిపతిరావు, హార్టికల్చరర్ ఎఇ వెంకటరావు, ఆర్డీవో వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి, ఎంపిపి ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ సత్యానారాయణ పాల్గొన్నారు.

అంబేద్కర్ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు
ఎచ్చెర్ల, ఏప్రిల్ 29: ఇక్కడి అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఐఎస్‌ఒ 9001:2008 గుర్తింపు లభించింది. ఈ విశ్వవిద్యాలయం అమలు చేస్తున్న ప్రమాణ పూర్వకమైన విధానాలు, ప్రధానంగా విద్యా విషయంలో సంబంధిత యాజమాన్య నిర్వహణ విధానం, సేవా కార్యక్రమాల అమలు, ఫీడ్‌బ్యాక్ విధానం, ల్యాబొరేటరీ వ్యవస్థ వంటి అంశాలపై అధ్యయనం చేసి ఈ గుర్తింపు ఇచ్చారు. ఐఎస్‌ఓ లీడ్ ఆడిటర్ ఆశీష్‌జైన్ స్వయంగా విసి లజపతిరాయ్‌కు శుక్రవారం గుర్తింపు పత్రాన్ని అందజేశారు. రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ తులసీరావు, ప్రిన్సిపాల్ చిరంజీవులు, ఎగ్జామినేషన్ డీన్ టి.కామరాజు, పాలక మండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, పూర్వపు రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రొఫెసర్ మురళీకృష్ణ ఉన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి: కళా
రణస్థలం, ఏప్రిల్ 29: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ది జరుగుతుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు పేర్కొన్నారు. బంటుపల్లిలో మహాలక్ష్మీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక యూనైటెడ్ బేవరీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటింటికీ 24 గంటల తాగునీటి సరఫరా పథకాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో మహాలక్ష్మీ యూత్ క్లబ్ అధ్యక్షులు నడుకుడితి ఈశ్వరరావును ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు ఎన్ని ఒడుదుడుకులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో తోటపల్లి కాలువ ద్వారా నీరు అందిస్తామన్న హామీ మేరకు సకాలంలో నీరు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో నీరు-చెట్టు పథకం ద్వారా 950 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. అదే విధంగా ప్రభుత్వం చేపడుతున్న ఇంకుడు గుంతల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వివరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పార్టీని నడిపించలేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు స్థానిక సంస్థలు బలోపేతం చేసే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్. ఈశ్వరరావు మాట్లాడుతూ ఇంటింటికీ నిరంతరం నీటి సరఫరా ఇవ్వడం ద్వారా తనకళ నెరవేరిందని పేర్కొన్నారు. లక్ష లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయాలని యూబి పరిశ్రమ ఎంతో సహకరించిందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా గ్రామంలో విద్య, వైద్యం, రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని పార్టీకతీతంగా అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత ఎమ్మెల్యే కళావెంకటరావు మండల కేంద్రంలో మండల పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల దుకాణాల సముదాయాన్ని ప్రారంభించి ఉపాధి కూలీలకు గునపాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొర్లె విజయకుమార్‌నాయుడు, టిడిపి నాయకుల ఆనందరావు, సత్యేంద్రవర్మ, యు బి పరిశ్రమ జనరల్ మేనేజర్ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

నీలాపుపేటలో అగ్ని ప్రమాదం... 14 ఇళ్లు దగ్ధం
గార, ఏప్రిల్ 29: మండలం శ్రీకూర్మం పంచాయతీ నీలాపుపేట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిని అగ్ని ప్రమాదంలో 14ఇళ్లు కాలిపోయాయి. ఇందులో 12ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 10లక్షలు వరకు ఆస్తి నష్టం ఉంటుందన్నది అధికారుల అంచనా. గ్రామానికి చెందిన చిదపాన యర్రయ్య, చిదపాన దుర్గమ్మ, చిదపాన చిన్నప్పమ్మ, గనె్నమ్మ, సూర్యనారాయణ, అప్పలమ్మ, శారద, చినలచ్చన్న, అసిరయ్య, అప్పయ్య, అసిరయ్య, గనె్నయ్య, కనకయ్య, ధనము తదితరులకు చెందిన ఇళ్లు కాలిపోయాయి. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న స్తానిక సర్పంచు బరాటం రామశేషు గ్రామానికి చేరుకొని పర్యవేక్షించి వివిధ విభాగాలకు సమాచారం అందించారు. ఇంతలో అగ్నిమాపక యంత్రం చేరుకొని మంటలను అదుపుచేసింది.
బాధితులందరికీ న్యాయం జరగాలి
* ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి
అగ్ని ప్రమాదంలో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం కూడా అందించే విధంగా అధికారులు దృష్టి సారించాలని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి స్పష్టం చేసారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మీదేవి గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరాతీసారు. రెక్కాడితే గాని డొక్కు నిండని కుటుంబాలని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే వద్ద గోడుమన్నాయి. ప్రమాదంలో నష్టం వాటిల్లిన 14 కుటుంబాలకు సహాయం అందివ్వాలని ఎమ్మెల్యే సూచించగా రెవెన్యూ అధికారులు మాత్రం 12 ఇళ్లకే సహాయం అందజేస్తామనడం గమనార్హం. ఈమె వెంట స్తానిక సర్పంచు బరాటం రామశేషు, మైగాపు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో సాగునీరు
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 29: వచ్చే ఖరీఫ్‌కు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చెరువు, గెడ్డ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేశారని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పేర్కొన్నారు. మండలంలోని పాత్రునివలస పంచాయతీ పరిధిలో గంగుల చెరువు పనులను ఆమె శుక్రవారం ప్రారంభించారు. అలాగే బుచ్చన్న బట్టెపై కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గంగుల చెరువు పనులకు రూ.9.50లక్షలను మంజూరు చేశామని, బుచ్చన్న బట్టెపై కల్వర్టు నిర్మాణానికి రూ.9.50లక్షలు మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ ఏడాది ఈ చెరువు పనులు చేపడుతున్నట్లు తెలియజేశారు. చెరువు ఆధారంగా వరిసాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు సీర రమణయ్య, తంగి దామోదర్, చిట్టి మోహన్, ఎఎంసి చైర్మన్ మూకళ్ల శ్రీనివాసరావు, దివాకర్, రమణ, ప్రసాద్, జెఇ రామశివాజీ, ఎర్రయ్య పాల్గొన్నారు.

సిస్టమ్‌లో ఎంసెట్
గార, ఏప్రిల్ 29: మండలం అంపోలు పంచాయతీ శారద ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఎం.సెట్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సౌకర్యాలు విద్యార్ధులకు ఎంతగానో ఊరటనిచ్చింది. ఈ పరీక్షకు సుమారు 80శాతం మంది విద్యార్ధులు హాజరైయ్యారని కళాశాల యాజమాన్యం డా. సరోజ్‌కుమార్ పాఢి తెలిపారు. ఈ పరీక్షలకు పలాస, వీరఘట్టం, రాజాం, హిరమండలం, పిన్నింటిపేట, శ్రీకాకుళం ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధుల సౌకర్యార్ధం కళాశాల బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఒకపక్క ఎండ వేడిమి, వేడి గాలులుతో విద్యార్ధులు తల్లడిల్లిపోయారు. కళాశాల ఆవరణలో యాజమాన్యం ఏర్పాటు చేసిన మజ్జిగ, మంచినీరు వంటి సౌకర్యాలు విద్యార్ధులను, విద్యార్ధుల తల్లిదండ్రులను ఎంతగానో సేదతీర్చింది.

బైరిదేశి గెడ్డ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 29: బైరిదేశి గెడ్డపనులకు స్థానిక ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. వంశదార నది నుండి ఓపెన్ హెడ్ చానెల్ ద్వారా బైరిదేశి గెడ్డకు సాగునీరు అందుతుంది. శ్రీకాకుళం రూరల్ మండలంతోపాటు గార మండలానికి కూడా బైరిదేశి గెడ్డకు సాగునీరు అందుతుంది. అయితే శివారు భూములకు సాగునీరు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఈపనులు చేపట్టేందుకు రూ.25లక్షల నిధులు మంజూరు చేశామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. పనులన్నీ పూర్తయితే వచ్చే ఖరీఫ్‌కు శివారు భూములకు కూడా సాగునీరు అందించడం జరుగుతుందని స్పష్టంచేశారు. ఈకార్యక్రమంలో ఎంపిపి గొండు జగన్నాధరావు, ఏ ఎం సి చైర్మన్ మూకళ్ల శ్రీనివాసరావు, అరవల రవీంద్ర, వంకాయల సూర్యప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.