శ్రీకాకుళం

జూన్ నెలాఖరు వరకు ఆరోదశ సాక్షరభారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లావేరు, ఏప్రిల్ 30: జిల్లాలో సాక్షరభారత్ ఆరోదశ కేంద్రాల నిర్వహణను జూన్ నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్టు జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. మండలంలో సాక్షరభారత్ కేంద్రాల పరిశీలనకు శనివారం విచ్చేసిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడారు. ఈ ఆరోదశ కార్యక్రమంలో 1,30,880 మంది నిరక్ష్య రాస్యులను అక్షరాస్యులు చేసే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. వీరిలో 70,530 మంది ఉపాధి హామీ కూలీలు కాగా 61,347మంది స్వయంశక్తి సంఘాల సభ్యులని వివరించారు. జనవరి నుండి ఈ కార్యక్రమంలో 2061 మంది విలేజ్‌కో ఆర్డినేటర్లు, 2351మంది మ్యాథ్స్, ఉపాధిపథకం, క్షేత్ర సిబ్బంది బోధకులుగా పనిచేస్తున్నారన్నారు. వృత్తి నైపుణ్యం, సాంఘిక చైతన్య కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒకటి వంతున కుట్టు మిషన్లును సరఫరా చేసి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణాకార్యక్రమం చేపట్టామన్నారు. శిక్షణ అనంతరం డిఆర్‌డిఏ సహకారంతో 50శాతం రాయితీపై కుట్టు మిషన్లు సరఫరా చేయనున్నట్టు వివరించారు. వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు తవ్వడం ఈసివో, అభ్యాసకుల భాగస్వామ్యంలో చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 10,099 వయో విద్యాకేంద్రాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. వీరికి కుట్టు మిషన్లు, తూనిక యంత్రాలు, బోధనా పరికరాలు, మ్యాప్‌లు, సోలార్ ల్యాంపులు సరఫరా చేసినట్టు వివరించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు పర్యవేక్షక పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకానికి సంబంధించి ఫైల్ పంపించినట్టు ఆయన తెలిపారు. ఆయన వెంట సూపర్‌వైజర్ జగన్నాథనాయుడు పాల్గొన్నారు.