శ్రీకాకుళం

‘అవగాహన లేని ఆరోపణలు తగవు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: నగరంలోని ఏడురోడ్ల కూడలి వద్దనున్న ఎన్టీఆర్ నగరపాలక సంస్థ క్రీడా మైదానంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అవగాహన లేని ఆరోపణలు చేయడం తగదని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన వైకాపా నగర అధ్యక్షుడు సాధు వైకుంఠంనకు మున్సిపల్ తీర్మానాలు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హక్కులు తెలియనట్లుందని ఎద్దేవా చేశారు. జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకే మైదానంలో ఎగ్జిబిషన్ కేటాయిం చారని, బహిరంగంగా చెబుతున్నామని, కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు. 2008లో తీర్మానాలు చేశామని చెబుతున్న నేతలు అదే మైదానంలో ఏ విధంగా జగన్మోహనరెడ్డి సభ నిర్వహించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ మంత్రిగా ధర్మాన ఉండగా ఇందిరా విజ్ఞాన్ భవన్‌కు ఏ విధంగా కేటాయించింది, పోస్టల్ స్థలంను తమ స్థలంగా ఏ విధంగా కలుపుకున్నదీ నగర ప్రజలకు తెలుసని అన్నారు. అలాగే 2.14 ఎకరాల స్థలం రికార్డులు లేకుండా చేసి ఆ స్థలాన్ని కాజేయాలని చేసిన ప్రయత్నంతో పాటు నగర ప్రజల వినోదం కోసం కేటాయించిన కోట్ల రూపాయల ఆస్తి కలిగిన టౌన్‌హాల్‌ను బినామీ పేర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయించిందీ నగర ప్రజలకు తెలుసన్నారు. ఇక పేదలకు నిర్మిస్తున్న ఇల్లు 200 అయితే, 250 ఇల్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కేటాయించారని ఆరోపణలు చేయడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో చిట్టి నాగభూషణరావు, ఐ.తిరుమలరావు, గంగు నాగేశ్వరరావు, పట్నాల పార్వతీశం, కరగాన భాస్కరరావు, కరగాన రాము పాల్గొన్నారు.