శ్రీకాకుళం

న్యాయస్థానం పట్ల అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, ఏప్రిల్ 30: బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసహాయం అందించడానికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలపట్ల అవగాహన కలిగి ఉండాలని పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి కిరణ్‌కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని మాలువ పంచాయతీ సవర మాలువ గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఉచిత న్యాయసలహా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి నేటికి కూడా ప్రజలు ముందుకు రావడం లేదన్నారు. పథకాలు సక్రమంగా అమలు కాని సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే లబ్ధిదారులకు న్యాయం చేకూర్చుతామని స్పష్టంచేశారు. గిరిజన హరిజనులు విద్యావంతులు కావాలని ఆయన కోరారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు గిరిజన గ్రామాలలో న్యాయసలహా కేంద్రాలను నిర్వహిస్తున్నామని వివరించారు. స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ జ్యోత్స్న ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు. స్థానిక తహశీల్దార్ ఈశ్వరమ్మ, పంచాయతీ విస్తరణాధికారి వెంకటరాజు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శోదాహరణంగా వివరించారు. పలువురు న్యాయవాదులు వివిధ అంశాలపై ప్రసంగించారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ కెవిఎం ప్రసాదరావు, సహకార సంఘ అధ్యక్షుడు నక్క రామరాజు, గిరిజనులు పాల్గొన్నారు.