శ్రీకాకుళం

‘మన ఊరు-మన బడి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాలలకు రోజు రోజుకూ ప్రాధాన్యం తగ్గడంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటీకి వెళ్ళి, బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించమంటూ అంగీకార ధ్రువపత్రాలను తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నారు. మరో ఐదురోజుల గడువులో ఈ కార్యక్రమం శతశాతం విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రానున్న విద్యాసంవత్సరానికి 538 పాఠశాలలకు తాళాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడం, అందులో పనిచేసే గురువులు అంగీకారం ఇస్తే గ్రామాధికారులుగా నియమించడం, రేషనైలేజేషన్ పేరిట ఉపాధ్యాయులను కుదించేయడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ బడుల్లో పిల్లలు పుష్కలంగా చదువులకు హాజరుకావాల్సివుంది. ప్రభుత్వ బడులు మనుగడ సాగించాలంటే, అంతోఇంతో తమ వంతు బాధ్యత తీసుకోవాలన్న తలంపుతో పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో ఇంటింటికీ బడిఈడు పిల్లల వివరాలు సేకరించి ఆయా ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేసుకునేలా తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తాకిడిని తట్టుకునేందుకు వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రాలు పొందాలనేది బడి పిలుస్తోంది కార్యక్రమం ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని మే ఐదో తేదీ వరకూ నిర్వహించేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సర్వశిక్ష అభియాన్, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’లో పాల్గొంటున్న ప్రధానోపాధ్యాయులకు 400రూ.లు, ఉపాధ్యాయులకు 250 రూ.లు చొప్పున్న సర్వశిక్షా అభియాన్ ద్వారా అందజేస్తున్నారు. మన బడి పిలుస్తోంది అనే ప్రత్యేక కార్యక్రమంలో 17643 మంది బడిఈడు పిల్లలను విద్యాశాఖ గుర్తించింది. వీరందరినీ వచ్చే విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు పొందినట్టు ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు పేర్కొంది. ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇదే కార్యక్రమాన్ని ‘మన ఊరు-మన బడి’గా పేరుమార్చి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం విజయవంతానికి గురువులంతా కృషి చేస్తేనే ఫలితాలు ఆశించినంతగా వస్తాయంటూ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొంటున్నారు.
జిల్లా, మండల, పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి వాటిద్వారా బాలబాలికలను అనే్వషించాలి. 2016-17 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని మరో ఐదు రోజుల్లో పూర్తి చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ళు నిండిన బాలలను గుర్తించాల్సివుంది. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసి ఆరోతరగతిలో ప్రవేశించేవారిని గుర్తించాలని, మురికివాడలను, దారిద్య్రలేఖకు దిగువ ఉన్నవారు నివసించే ప్రాంతాలను సందర్శించి బడిఈడు బాలలను గుర్తించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తోన్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించడం ద్వారా బాలలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు అధికారులు సూచించారు. మన ఊరు-మన బడి రోజువారీ కార్యక్రమ నిర్వహణ నివేదికలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు అందజేయాలని పేర్కొన్నారు.