శ్రీకాకుళం

మజ్జిగ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: జిల్లాలో వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్య కూడళ్ళలో మజ్జిగ, మంచినీటి కేంద్రాలు తక్షణం ఏర్పాటు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఆదేశించారు. వేసవి వేడిమి దృష్ట్యా ప్రజలకు మంచినీటిని, మజ్జిగను అందించేందుకు ప్రభుత్వం రూ.3కోట్లు విడుదల చేసిందన్నారు. దీనిని పక్కాగా అమలు చేయుటకు కార్యాచరణపై జిల్లా నీటియాజమాన్య సంస్థ, జిల్లా మహిళా సమాఖ్య, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని ఆ ప్రదేశాల్లో విధిగా మజ్జికను సరఫరా చేయాలన్నారు. జిల్లాలో 2.50లక్షల మంది వేతనదారులు దాదాపు 2500 ప్రదేశాల్లో పనిచేస్తున్నారన్నారు. మజ్జిగను సరఫరా చేసేందుకు ఒక వ్యక్తికి రూ.3చొప్పున అందిస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ బాధ్యతలు తీసుకొని మజ్జిగను సరఫరా చేయాలని అందుకు గల వ్యయాన్ని చెల్లిస్తామన్నారు. అదే విధంగా జిల్లాలో వివిధ ప్రాంతాలు, కూడళ్లలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే 60 ప్రదేశాల్లో చలివేంద్రాలను నిర్వహిస్తుందని శ్రీకాకుళం నగర పాలక సంస్థ, ఇతర సంస్థలు కూడా చలివేంద్రాలను నిర్వహిస్తూ మంచినీటిని సరఫరా చేస్తున్నాయన్నారు. ఈ కేంద్రాల్లో మజ్జిగను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జెసి వివేక్‌యాదవ్, డిఎస్సీ కె.మోహనరావు, డుమా పిడి ఆర్.కూర్మనాథ్, డిఆర్‌డిఏఏ పిడి రమణారావు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు సత్యప్రభ, ఏరియా కో ఆర్డినేటర్ రవి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.