శ్రీకాకుళం

ప్రణాళికతోనే సహకార సంఘాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 30: సహకార సంఘాలు రైతుల సంక్షేమం కోసం ఏర్పడినవని, వీటి అభివృద్ధికి ఒక నిర్థిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రైతులకు సాయం చేయాలంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం సూచించారు. ఇక్కడ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువులు సరఫరాలే కాకుండా సొసైటీ ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి పౌల్ట్రీలు, కోళ్ళు పెంపకం, గవర్నమెంటు పాఠపుస్తకాలు, నోట్‌బుక్స్ అమ్మకాలు చేపట్టాలని సూచించారు. సొసైటీలు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ద్వారా రైతులకు సర్వీసు చేయవచ్చని చెప్పారు. సొసైటీలు ముందుకువస్తే హార్టికల్చర్, సెరీ కల్చర్, వ్యవసాయశాఖ సహకార సంఘాల అధ్యక్షులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలుకు పక్కాగా ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులు మల్బరీ తోటలు పెంపకానికి ముందుకు వస్తే వారు షెడ్లు నిర్మించుకోవడానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశం ఉందని తెలిపారు. కోపరేటివ్ సహకార సంఘాల అదనపు రిజిష్టరర్ ఎ.వి.వి. ప్రసాద్ మట్లాడుతూ సహకార సంఘాలకు కమ్యూనికేషన్ సిస్టమ్ ముఖ్యమన్నారు. సమావేశాలు ఏర్పాటు చేసినపుడు నేర్పిరితనం ఉండాలన్నారు. సహకార వ్యవస్థ వ్యాపారానికి సంబంధించిన అంశం, వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా పనిచేసే రైతులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. అన్ని పి.ఎ.సి.లకు తప్పనిసరిగా గొదాములు ఉండాలన్నారు. స్థలం లేని సొసైటీలకు స్థలం కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదించాలని చెప్పారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ డోల జగన్మోహనరావు మాట్లాడుతూ జిల్లాలో 49 సహకార సంఘాలు ఉన్నాయని, 32 సంఘాలకు గొదాములు ఉన్నాయని తెలిపారు. 11 సంఘాల గొదాములు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మిగిలిన ఆరు సొసైటీలకు నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పారు. సొసైటీలు ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలుకు సంబంధించి రావలసిన కమీషన్ విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమావేశంలో డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, కోపరేటివ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ నర్తు నరేంద్ర, సి.ఇ.వో, డి.సత్యన్నారాయణ, డి.జి.ఎం. ఎం.జ్యోతిర్మయి, డి.వరప్రసాద్, బోర్డు డైరక్టర్లు పాల్గొన్నారు.