శ్రీకాకుళం

కరవును ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: జిల్లాలో కరవును ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలోని 13 జిల్లాలో కరవు చాయలు అలుముకున్నాయని అన్నారు. దీంతో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడి పోతున్నారని, ప్రభుత్వం మంచినీటిపై కనీస చర్యలు తీసుకున్న దాఖలా లేదని తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర మంత్రిగా ఉండగా, ఇటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలుగా సుమారు 40 కోట్ల రూపాయలతో 24 గంటల మంచినీటి పథకంనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మోసపూరిత వాగ్దానాలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక ఏ విధంగా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామా అన్న మీమాంస తప్ప ప్రజల కష్టాలు పట్టడం లేదని విమర్శించారు. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎపుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని, ప్రజలతోనే ఉంటుందని పేర్కొన్నారు. చంద్రబాబు దుర్మార్గపు చర్యలను నిరసిస్తూ మే నెల 2వ తేదీన జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపే కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు సమావేశంలో అంధవరపు సూరిబాబు, మండవిల్లి రవి, రొక్కం సూర్యప్రకాషరావు, తంగుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.