శ్రీకాకుళం

రాజీ మార్గమే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 30: రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారం ఎంతో ఆవశ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అన్నారు. రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారంపై రిఫరల్ జడ్జిలకు శనివారం జిల్లా కోర్టులో అవగాహన సదస్సు జరిగింది. జిల్లాప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజీమార్గాల కేంద్రం సంచాలకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీ మార్గాల ద్వారా ప్రభావ వంతంగా కేసుల పరిష్కారానికి గల మార్గాలను ఆమె సూచించారు. సదస్సుకు రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించిన మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి.గౌతమ్‌ప్రసాద్ మాట్లాడుతూ కేసులను క్షుణ్ణంగా పరిశీలించి రాజీ మార్గాలకు అవకాశాలు ఉండే కేసులను ఎంపిక చేసి మధ్యవర్తుల ద్వారా రాజీ మార్గాల ద్వారా కేసుల పరిష్కారానికి సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.పద్మావతి, మొదటి అదనపు జ్యూడిషీయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.నాగమణి, ప్రత్యేక జ్యూడిషీయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వై.శ్రీనివాసరావు, శిక్షణ పొందిన మధ్యవర్తులు రమేష్, రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.