శ్రీకాకుళం

రోడ్డుప్రమాదంలో డ్రైవర్ మృతి,

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్కలి, ఏప్రిల్ 30: జాతీయ రహదారిపై అంజనాపురం కూడలి వద్ద శనివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి వ్యాన్‌లో వెళ్తున్న 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శ్రీకాకుళం వైపు నుంచి చిలక క్యాంటీన్‌కు ఆర్మీ సామగ్రితో వెళ్తున్న వ్యాన్ ముందుగా అదే రూట్‌లో కోటబొమ్మాళి నుంచి సవరగోపాలపురంలోని పెళ్లికి వెళ్తున్న వ్యాన్‌ను వెనుక నుంచి ఢీ కొన్న సంఘటనలో డ్రైవర్ టి.రవీంద్ర(35) అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికి వెళ్తున్న 12 మందికి స్వల్పగాయాలయ్యాయి. పెళ్లి వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారిని 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతుడు రవీంద్రను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు టెక్కలి ఎస్‌ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.