శ్రీకాకుళం

‘తెలుగు ప్రజల సహనాన్ని పరీక్షించొద్దు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: కేంద్ర, రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలు అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీనే ముద్దాయిగా చూపిస్తూ తెలుగు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయని ఎపిసిసి అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో నిజంగా విభజన ద్వారా అన్యాయం జరిగితే సరిదిద్దడానికి ఎన్‌డిఎ ప్రభుత్వానికి రెండేళ్లు సమయం చాలదా అన్నారు. ఆనాడు పార్లమెంటు సాక్షిగా ఐదుళ్లు ప్రత్యేక హోదాను యుపిఎ ప్రభుత్వం ప్రకటిస్తే ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలన్న ఆనాటి విపక్ష నేత వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హె.పి.చౌదరి హోదా అక్కర్లేదని ప్రకటనచేస్తే వౌనం వహించడం శోచనీయమన్నారు. నాడు రాష్ట్ర ప్రజల పక్షాన వాదించి సన్మానాలు అందుకున్న వెంకయ్యనాయుడు వంటివారి స్వార్థ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎపిసిసి తరుపున తాము ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్భ్రావృద్ధి కోసం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి ఆ హక్కు లేదని టిడిపి, బిజెపిలు పేర్కొని, తీరా నేడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదని ప్రకటించడం కన్నా మించిన ద్రోహం లేదని అన్నారు.