శ్రీకాకుళం

తేలని నీలాపుపేట అగ్నిబాధితుల సంఖ్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, ఏప్రిల్ 30: మండలం శ్రీకూర్మం పంచాయతీ నీలాపుపేటలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో బాధిత కుటుంబాలు ఎన్ని అన్నది ఇంత వరకు ధ్రువీకరణ కాలేదు. అందుకు ఎమ్మెల్యే.. తహశీల్దారుల ప్రకటనలే నిదర్శనం. అగ్ని ప్రమాదంలో నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబానికి చేయూత ఇవ్వాలని, 14కుటుంబాలకు ప్రభుత్వపరంగా సహాయం అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అధికారులకు సూచించారు. అయితే అగ్ని ప్రమాదంలో కాలిపోయిన 12 ఇళ్లకు సంబంధించిన కుటుంబాలకే ప్రభుత్వ సహాయం అందజేస్తామని తహశీల్దారు ఎ.సింహాచలం స్పష్టం చేసారు. చివరకు ఎం.పి. చేతులు మీదుగా 11మంది అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయాన్ని అందజేశారు. అగ్ని ప్రమాదం కారణంగా నష్టం వాటిల్లిన ప్రతి కుటుంబాన్ని అదుకోవాలని ఎమ్మెల్యే సూచించినప్పటికీ తహశీల్దారు ముందుగా 12 అని తరువాత 11 ఇళ్లకే సహాయాన్ని అందజేయడంపై తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 14 ఇళ్లకు సంబంధించిన కుటుంబాలకు సహాయం అందజేయాలని ఎమ్మెల్యే చెప్పినప్పటికీ తహశీల్దారు ససేమిరా అనడం ఈ ప్రాంతంలో రాజకీయ దుమారం లేపింది. ఇక్కడ జరిగిన ప్రమాదంలో అధికారులు తెలియజేస్తున్న లెక్కలకు, ప్రజా ప్రతినిధులు తెలియజేసిన లెక్కలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఈ ప్రాంతంలో కాలిన ఇళ్ల ఎన్ని అన్నది ప్రశ్నార్థకంగానే మిగిలింది.