శ్రీకాకుళం

‘ప్రభుత్వ బడుల నిర్వీర్యానికి కుట్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాల విద్యను పటిష్ఠ పర్చాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్‌కు ఉపయోగకరంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు విమర్శించారు. స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను క్రమంగా మూసివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోందని అన్నారు. పాఠశాలల మూసివేత కారణంగా అటు విద్యార్థులు విద్యకు దూరం కావడమే కాకుండా ఇటు ఉపాధ్యాయుల భవిష్యత్ సైతం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రతీ ఆవాస ప్రాంతానికి ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత విద్యా సంవత్సరంలో సుమారు 250 పాఠశాలలు మూతపడగా, ప్రస్తుతం ప్రభుత్వ చర్యలతో వెయ్యి పాఠశాలల వరకు మూతపడనున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా జైలుకు
నాన్ అఫీషియల్ విజిటర్స్ నియామకం
గార, ఏప్రిల్ 30: రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా జైలుకు నలుగురు నాన్ అఫీషియల్ విజిటర్స్‌ను నియమించినట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఏ పి హెచ్‌బి కాలనీకి చెందిన గుడ్ల కృష్ణారావు, నరసన్నపేట బైరాగివీధికి చెందిన శిమ్మ శేషగిరి, శ్రీకాకుళం రామకృష్ణానగర్‌కు చెందిన గేదెల ఇందిరాప్రసాదరావు, శ్రీకాకుళం ఎల్‌బిఎస్ కాలనీకి చెందిన తూలుగు బృందలను నియమించినట్టు ఆయన తెలిపారు.