శ్రీకాకుళం

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, నవంబర్ 21: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కె.్ధనంజయరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి అధిక ఆదాయాన్ని అందించే శాఖలల్లో మత్స్యశాఖ ఒకటన్నారు. ఆటుపోట్లతో కొనసాగే మత్స్యకారుల జీవనాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మత్స్యశాఖను వ్యవసాయ అనుబంద రంగాల్లో చేర్చడం జరిగిందన్నారు. మన జిల్లాలో 193 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని అయినా జిల్లా నుండి గుజరాత్‌కు మత్స్యకారులు వలస పోవడాన్ని అరికట్టడానికి అనేక పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ చర్యల్లో భాగంగా జిల్లాకు రెట్టింపు నిధులను మంజూరు చేయాలని కమీషనర్‌ను కోరినట్లు తెలిపారు. సముద్రం వేటకు ఉపయోగించే పెట్టబోట్లకు రూ.100కోట్లను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనిలో భాగంగా 272 చేపల ఎండబెట్టుకునే ఫ్లాట్‌ఫారాలను మంజూరు చేశామన్నారు. రెండు ఫిష్‌ల్యాండింగ్ జెట్టీలను మంజూరు చేశామన్నారు. రామచంద్రాపురం పెద్దకొవ్వాడ, చినకొవ్వాడ గ్రామాల్లో కోల్డ్‌స్టోరేజ్ యూనిట్లను ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందిస్తామన్నారు. మార్కెటింగ్ సదుపాయాన్ని కలుగజేయడంతో పాటు ఉపాధి హామీ నిధులతో రహదారి నిర్మాణాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధులతో సముద్రం వేటకు వెళ్లేవారికి కళ్లద్దాలు అందిస్తామన్నారు. 50 సంవత్సరాలు నిండిన మత్స్యకారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చంద్రన్న భీమాలో నమోదు అందరూ నమోద కావాలని జిల్లాలో 26554మంది మత్స్యకారులు చంద్రన్న భీమాలో నమోదు కాబడినట్లు తెలిపారు. స్ర్తి నిధి రుణాలను బ్యాంకు రుణాలు అందిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు మరుగుదొడ్లు నిర్మించుకొని ఆరుబయట మలవిసర్జన మానుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పంపిన సందేశాన్ని రమణమాదిగ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులకు రెండు నిముషాలు వౌనం పాటించి నివాళులర్పించారు. లబ్ధిదారులకు త్రిచక్ర, ద్విచక్ర వాహనాలు, వెండింగ్ యూనిట్లను అందించారు. ఈ కార్యక్రమానికి జెసి-2 పి.రజనీకాంతారావు, మత్య్యశాఖ సంయుక్త సంచాలకులు కృష్ణారావు, డి ఆర్ డి ఏ పిడి కిషోర్‌కుమార్, వ్యవసాయ శాఖ జెడి జి.రామారావు, పశుసంవర్ధక శాఖ జెడి ఎం.వెంకటేశ్వర్లు, ఎంపిపి గొండు జగన్నాధరావు, జెడ్పిటీసీ ధర్మాన ప్రసాదరావు, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు మైలపల్లి నర్శింగరావు, మత్స్యకార సంఘ నాయకులు తదితరులు హాజరయ్యారు.