శ్రీకాకుళం

అక్రమంగా తరలుతున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జనవరి 22: మండలంలోని మడపాం జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద అక్రమంగా తరలుతున్న ప్రభుత్వ పి డి ఎస్ బియ్యం లారీని పట్టుకోవడం జరిగిందని జిల్లా విజిలెన్స్ ఎస్పీ టి.హరికృష్ణ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రేంపాడు గ్రామంలో ఉన్న వెంకటసత్యసాయి దుర్గ రైస్‌మిల్లు నుండి 800బియ్యం బస్తాలు ఇచ్ఛాపురం మండలం చీకటిపేటకు తరలిస్తున్నారని సమాచారం అందుకుని లారీని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. సుమారు 20 టన్నుల మేర బియ్యం ఉన్నాయని వీటి విలువ రూ.4లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈమేరకు లారీని సీజ్ చేశామని తెలిపారు. అనంతరం బియ్యం బస్తాలను మండల కేంద్రంలోని స్థానిక పౌరసరఫరాల గోదాంకు తరలించామని లారీని స్థానిక పోలీసులకు అప్పగించామని తెలిపారు. ఈకార్యక్రమంలో విజిలెన్స్ డీ ఎస్పీ ప్రసాదరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆర్.శ్రీనివాసరావు, ఎస్ ఐ లు బాబూరావు, ఈశ్వరరరావు, పౌరసరఫరాల శాఖ డి.టి శ్రీనివాసరావు, వి ఆర్ వోలు తదితరులు పాల్గొన్నారు.

యాత్ర ఏర్పాట్లను పరిశీలించి డీఎస్పీ
రణస్థలం, జనవరి 22: కమ్మసిగడాం గ్రామంలో ఈనెల 26 నుంచి జరగనున్న యాత్ర నేపధ్యంలో ఏర్పాట్లను శ్రీకాకుళం డీ ఎస్పీ భీమారావు పరిశీలించారు. సోమవారం ఆయన గుడి వద్దకు చేరుకుని కమిటీ సభ్యులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్కింగ్, క్యూలైన్లు తదితర విషయాల గురించి ఆలయ కమిటీ ప్రదాన కార్యదర్శి నడుకుదిటి ఈశ్వరరావు డీ ఎస్పీకి వివరించారు. ప్రధానంగా వాహనాల రాకపోకల సమయంలో ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జె ఆర్ పురం సి ఐ రామకృష్ణ, ఎస్ ఐ సత్యనారాయణలకు ఆయన సూచించారు.