శ్రీకాకుళం

పవన్‌కళ్యాణ్ ప్రజాయాత్రను స్వాగతిస్తున్నాం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 22: జనసేనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రజాయాత్ర చేయడం శుభపరిణామని శాసనమండలి విప్, ఎమ్మెల్సీ బుద్ద వెంకటేశ్వరరావు తెలిపారు. పవన్‌కళ్యాణ్ తమకు మిత్రుడని, గత ఎన్నికల్లో మాకు ఎంతో సహకరించిన ఆయన చేపట్టిన రాజకీయయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్టు బుద్ద అన్నారు. తెలుగుదేశం పార్టీని గౌరవించి, గడచిన ఎన్నికల్లో సహాయసహకారాలు అందించి, ప్రచారపర్వానికి పర్వతమంత బలాన్ని చేకూర్చిన పవన్‌కళ్యాణ్ టిడీపీకి ఎప్పుడూ మిత్రుడుగానే ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. పేదల పక్షాన చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో..ప్రజల సమస్యలల పట్ల జనసేనాని స్పందించడం మంచిదేనన్నారు. శాసనమండలి హామీల కమిటీ పర్యటనలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాకు కమిటీ చైర్మన్ గాలిముద్దుకృష్ణమనాయుడుతో కలిసి వచ్చిన వెంకన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ విలేఖరులతో మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని..సూర్యనారాయణస్వామితో పాటు రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళు కరుణ ముఖ్యమంత్రిపై ఉంటుందని అన్నారు. ఖచ్చితంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
కొవ్వాడలో పవన్‌కళ్యాణ్ ప్రకంపనలు!!
జిల్లాలో రణస్థలం మండలం కొవ్వాడలో పదివేల మోగావాట్ల సామర్థ్యం కలిగిన అణువిద్యుత్ కేంద్రాన్ని తన ప్రజాయాత్రలో ప్రధాన చోటు కల్పించారు. జిల్లా పర్యటనకు వచ్చే సమయంలో కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుపై అక్కడ ప్రజలు వ్యతిరేకవిధానాలు, ఉద్యమాలు, ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి వంటి అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించనున్నట్టు పవన్‌కళ్యాణ్ సోమవారం ఆయన తెలంగాణలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో పవన్ ప్రకంపనలు సిక్కోల్‌కు ముందస్తుగా తాకాయి!

దుకాణాలపై ఇంటిలిజెన్స్ అధికారులు దాడులు
పొందూరు, జనవరి 22: విజయనగరం జోనల్ కమీషనర్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారి ఆదేశాల మేరకు స్థానిక మహరాజా మార్కెట్ దుకాణాలపై అసిస్టెంట్ కమీషనర్ ప్రసాదరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ రాణి రత్నకుమారి, జి ఎస్ టి అధికారి ప్రశాంత్ ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించారు. విక్రయాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ కమీషనర్ ఆఫీసులో రికార్డులను తనిఖీ చేసి కొనుగోలు, అమ్మకాలపై సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు. జి ఎస్ టి బిల్లు కష్టమర్ చెల్లించాల్సి ఉందన్నారు. ఈసందర్భంగా అసిస్టెంట్ కమీషనర్ మాట్లాడుతూ కొనుగోలుకు సంబంధించి రూ.200 దాటితే ఖచ్చితంగా బిల్లు అందించాలని తెలిపారు. బిల్లు ఇవ్వలేని వారిపై వినియోగదారులు ఫిర్యాదు చేయాలని సూచించారు. వస్తువులు కొనుగోలుపై వినియోగదారుడు 5శాతం జి ఎస్ టి చెల్లించాల్సి ఉందన్నారు. కాంపోజిసన్ స్కీమ్‌లో 1శాతం జి ఎస్ టి డీలర్లు కట్టుకోవాలని తెలిపారు.

జ్ఞాన సరస్వతీ దేవి సమక్షంలో అక్షరాభ్యాసాలు
సారవకోట, జనవరి 22: సరస్వతీ దేవి జన్మదినం శ్రీ పంచమి సందర్భంగా సోమవారం మండలంలోని సవరడ్డపనస గ్రామంలో బాపూజీ విద్యాకేంద్రంలో 21మంది పిల్లలకు అక్షరాబ్యాస కార్యక్రమాన్ని పాఠశాల అధిపతి వాడ పున్నయ్య, రమణమ్మ దంపతులు నిర్వహించారు. సారవకోటకు చెందిన రుత్వికులు జోష్యుల శ్రీనివాస చక్రవర్తి, గ్రామ పురోహితుడు తలసీ రామకృష్ణ ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం వాడ పున్నయ్య దంపతులు పసుపు- కుంకుమలో పసుపుకొమ్ముచేత ఓంకారాన్ని విద్యార్ధుల చేత రాయించి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పాఠశాల ఆవరణలో ప్రతిష్టించిని జ్ఞాన సరస్వతీదేవి వినాయక ప్రతిమల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బాలబాలికల తల్లిదండ్రులు పాల్గొన్నారు.