శ్రీకాకుళం

నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలాకి, ఫిబ్రవరి 16: మండలంలో గల స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో 21మంది అంత్యోదయ కార్డులు పంపిణీ చేసినట్లు మండల తహశీల్దార్ జెన్ని రామారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరై మండలంలో గల 31 గ్రామపంచాయతీలలో ఉన్న లబ్ధిదారులకు అంత్యోదయ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్డుల ఎంపిక శ్రీకాకుళం రిమ్స్‌వారి ఆమోదం తెలిపిన ధృవపత్రాల ఆధారంగా అందించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమపథకమైనా అర్హులైన వారికి మాత్రమే అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇవే కాకుండా ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారు తహశీల్దార్ సమక్షంకి వచ్చినట్లయితే వారికి కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈకార్యక్రమంలో డి.టి అప్పారావు, ఆర్. ఐ ఢిల్లీశ్వరరావు, జెడ్పిటీసీ గొండు రామన్న, మండల ప్రత్యేక సలహాదారు తమ్మినేని భూషణరావు, వెంకటప్పలనాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు కిల్లి వేణుగోపాలస్వామి, ఏ ఎంసి చైర్మన్ బైరి భాస్కరరావు, స్థానిక సర్పంచ్ లుకలాపు కల్పనారాంబాబు, ఎంపిటీసీ మజ్జి రమణమ్మలు పాల్గొన్నారు.

శుద్ధ్దజలాల ప్లాంట్ పరిశీలన
మందస, ఫిబ్రవరి 16: మండలంలోని బాలిగాం పరిధిలోని 2 కోట్ల 8 లక్షల రూపాయలతో ఎన్‌టి ఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో శుద్దజలాల ప్లాంట్ పనులను శుక్రవారం ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుద్దజలాల ప్లాంట్ పనులను త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ఉద్దానంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు శుద్దజలాన్ని అందించే చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వేసవికాలంలో ఈ శుద్దజలాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈయనతోపాటు ఇ ఇపి రవి, డి ఇ హనుమంతురావు, ఎఇలు టి.రాజేష్, గౌతమి, ఎన్‌టి ఆర్ శుద్దజలాల ప్లాంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.