శ్రీకాకుళం

తపాలా పథకాలపై ప్రజలకు అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరమండలం, ఫిబ్రవరి 23: తపాలా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం హిరమండలం ప్రధాన రహదారి గుండా అవగాహనా ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం పోస్టల్ సూపరింటెండెంట్ నాగాదీత్యకుమార్ మాట్లాడుతూ గ్రామీణ పోస్టల్ జీవిత బీమా ప్రజలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆమదాలవలస సబ్ డివిజన్ పరిధిలోని 10.37 లక్షల రూపాయలు బీమా లక్ష్యాన్ని అధిగమించినట్టు తెలిపారు. అలాగే ఎస్‌బి, ఆర్‌డి, సుకన్య ఖాతాలను ప్రారంభించామన్నారు. ఏప్రిల్ నెల నుంచి జిల్లాలో పోస్టల్ పేమెంట్ సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస ఏ ఎస్‌పి ఆర్.నవీన్‌కుమార్, రాజాం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ పరిశీలకులు అచ్యుతకుమార్, హిరమండలం పోస్టు మాస్టర్ ఎం.తిరుపతిరావు తదితరులున్నారు.
గ్రామాల్లో ప్రత్యేక అవసరాల పిల్లలపై గుర్తింపు సర్వే
హిరమండలం, ఫిబ్రవరి 23: మండలంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించడానికి సర్వే చేపడుతున్నారు. శుక్రవారం మండలంలోని పి.వి.కాలనీలో సర్వే చేపట్టారు. అంగవైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి ప్రభుత్వ పథకాలను అందించడంతో పాటు ఫిజియోథెరిపీ వంటి సేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐ ఇ ఆర్‌టి సీతంనాయుడు తెలిపారు. గ్రామాల్లో ప్రజలు సహకరించి దివ్యాంగులు గల పిల్లల సమాచారాన్ని అందించాలని సూచించారు.
ఘనంగా ఎర్రంనాయుడు జయంతి వేడుకలు
హిరమండలం, ఫిబ్రవరి 23: మండలంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎర్రన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గవర పద్మావతి, మండల ప్రత్యేకాహ్వానితులు చిట్టిబాబు, ఎంపిడి ఒ రామస్వామి, తహశీల్దార్ కాళీప్రసాద్, ఎం ఇ ఒ రాంబాబు తదితరులున్నారు.
* ఎల్ ఎన్‌పేటలో...
మండలంలోని దివంగత మాజీ కేంద్ర మంతి కింజరాపు ఎర్రంనాయుడు జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపిడి ఒ కార్యాలయంలో అధికారులు ఎర్రన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. జిల్లాకు చేసిన సేవల గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిడి ఒ మోహన్‌ప్రసాద్, ఇతర సిబ్బంది ఉన్నారు.

కోర్కెలు తీర్చే కల్పవల్లి ఎల్లమ్మతల్లి
* 25న పలాసలో జామిజాతర
పలాస, ఫిబ్రవరి 23: కోర్కెలు తీర్చే కల్పవల్లి, రోగాలు నయం చేసే ధన్వంతరిగా, నిస్సంతులెకు సంతతి ప్రసాదించే సంతాన లక్ష్మిగా తరతరాలుగా నుండి కొలిచే తల్లి ఎల్లమ్మతల్లి. పలాసలో వేంచేసియున్న ఎల్లమ్మదేవత తరతరాలు నుంచి అనుశృతంగా జరుగుతున్న ఈ జాతర జిల్లాలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ఉత్సవం ప్రతి ఏటా శివరాత్రి తదుపరి వచ్చే మృగశిర నక్షత్రం సింధూరపంట కార్యక్రమంతో ప్రారంభమై మరునాడు జరిగే ఉత్సవం ‘జామిజాతర’. తర్లా జమిందారుల అనువంశిక పాలనలో వారి ఆలనాపాలనాలో వందలాది ఏళ్లు నుంచి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం జరుగుతూ వస్తుంది. జమీందారు వారి హాయంలో ఈ దేవత పేరిట 9 ఎకరాల మాన్యం జగన్నాథసాగరం పారుదలతో ఉండేది. జమిందారి అంతరించిన తర్వాత దేవుని భూమి పరాధీనమైంది. ప్రస్తుతం ఆ భూమి అనుభవిస్తున్న భూస్వామి సదరు భూమి కోర్టు మూలంగా జమిందారు నుండి దాఖలుపడినట్లు తెలియజేస్తున్నారు. నేటి వరకరు ఆ భూమి ఎల్లమ్మ మాన్యంగానే రెవెన్యూ రికార్డులు తెలియజేయుచున్నావి. జమిందారు రద్దుకాబడిన దగ్గర నుంచి నేటి వరకు ఆలయ పునరుద్దరణ పూజా కార్యక్రమాలె జాతర నిర్వహణ ఆలయ అర్చకులు మాత్రమే స్థానిక సేవా సంస్థల సహాకారంతో జరిపించుచున్నారు. జాతర ముందురోజు దివాణానికి వెళ్లి అగ్నిగుండ కార్యక్రమ నిర్వహణ జరుగుతుంది. తొలి పూజ జమీందారుపడితో ప్రారంభమై ఈ జాతర ప్రారంభం అవుతుంది. జిల్లాలో ప్రసిద్దిగాంచిన ఈ జాతర వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రక్కనున్న ఒరిస్సా రాష్ట్రం నుంచి జిల్లా నలుమూలలు నుంచి భక్తులు వస్తుంటారు. కొల్లకోట వంశీయులు ఏడుతరాలుగా ఆలయ అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేది ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్లమ్మతల్లి దర్శనాలు ఉంటాయన్నారు.