శ్రీకాకుళం

గిరిజనులకు అన్యాయం జరగకుండా మత్స్యకారులను ఎస్టీ జాబితాలోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: గిరిజనులకు అన్యాయం జరగకుండా మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ, చేనేత, జౌలి శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్న మత్స్యకారులతో శుక్రవారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిధిగృహంలో చర్చించారు. చర్చల్లో నిరాహార దీక్షలు విరమించేందుకు అంగీకరించారని మంత్రి తెలిపారు. అనంతరం మత్స్యకార సంఘ నాయకులతో కలిసి చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. మత్స్యకారులు తమను గిరిజన జాబితాలో చేర్చాలని గత 75 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని మంత్రి అన్నారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఎన్నికల మ్యాన్‌ఫెస్టోలో ఎస్టీ జాబితాలో చేర్చేందుకు హామీ ఇవ్వడం జరిగిందని ఆయన స్పష్టంచేశారు. ఈ సమస్యను సి ఎం చంద్రబాబునాయుడు దృష్టిలో పెట్టామని చెప్పారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడం వలన గిరిజనులకు అవకాశాలు తగ్గిపోతాయనే ఆందోళన గిరిజనులలో ఉందని అయితే అదివాస్తవం కాదన్నారు. అన్ని వర్గాల శ్రేయస్సును గ్రిప్‌లో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టంచేశారు. గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 13 జిల్లాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. మార్చి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మంత్రి చెప్పారు. సమస్య పరిష్కార బాధ్యత తీసుకుంటాతమన్నారు. ఎస్టీలకు ఏ మాత్రం నష్టం వాటిల్లదని ఆయన పేర్కొన్నారు. బాధ్యతగల వ్యక్తిగా మంత్రిగా హామీ ఇస్తున్నానని విశ్వాసం ఉంచాలన్నారు. మత్స్యకార సంఘ నాయకులు ఎస్. చంద్రమోహన్‌మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చారని సంతోషంగా ఉందన్నారు. గిరిజనుల హక్కుల హరించే ఉద్దేశ్యం మత్స్యకారులకు లేదన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని కోరారు. అనంతరం ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుండ లక్ష్మీదేవిలు నిరాహార దీక్షవద్దకు వెళ్లి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష, పూర్వపు అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, బోయిన గోవిందరాజులు, మత్స్యకార సంఘ నాయకులు ఫల్గుణరావు, గొంటి మధు, గౌతమ్, మైలపల్లి నర్శింహమూర్తి, పుక్కళ్ల పాపారావు, కొర్లయ్య, రాంబాబు, చింతపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అగ్నిబాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
సరుబుజ్జిలి, ఫిబ్రవరి 23: మండలంలోని చిగురువలస గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన అగ్ని బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాజీ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం వైకాపా అధ్యక్షులు తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన చిగురువలస గ్రామాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టాల వివరాలను అడిగి తెలుసుకొని బాధితులను ఓదార్చారు. తమ్మినేని శ్రీరామ్మూర్తి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బాధితులైన పది కుటుంబాలకు మాజీ మంత్రి సీతారాం దుస్తులు, వంటపాత్రలు అందించగా, సరుబుజ్జిలి ఎంపిపి సత్యనారాయణ ఒక్కొక్క కుటుంబానికి రూ.500 నగదు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదాల్లో పలువురు బాధితులు గగ్గోలు పెడుతున్నారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పక్కా గృహాలు మంజూరు, వారి వారి కులవృత్తుల ఆధారంగా చేయూతనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ప్రతినిధి సురవరపు నాగేశ్వరరావు, సర్పంచ్ చిరంజీవి, వైస్ ఎంపిపి రావాడ రవి, మండల ఎస్‌సి సెల్ కన్వీనర్ సూర్యప్రకాష్, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.