శ్రీకాకుళం

ఐఐటి కోర్సుపై ఉపాధ్యాయులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), మే 13: జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి అర్భన్ పాఠశాలల్లో ఏడు నుండి పదో తరగతికి చెందిన విద్యార్థులకు ఐఐటి సిలబస్ బోధించనున్నారు. ఇందుకు గానుముందస్తుగా ఆయా మున్సిపాలిటీలకు చెందిన ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ డిఇవో విఎస్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఇకమీదట ఆర్భన్ ఏరియాలో ఉన్న పాఠశాలలు కూడా ఐఐటి కోర్సుకు సంబంధించి పాఠ్యాంశాలను బోధించనున్నారు. అందుకు ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలన్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టులకు సంబంధించి సంబంధిత ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పలువురు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు