శ్రీకాకుళం

డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, మే 17: డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలను మంగళవారం అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వైస్ చాన్సలర్ ఎం.చంద్రయ్య విడుదల చేసారు. 36.34శాతం ఉత్తీర్ణత సాధించారు. బి ఏ గ్రూపు నుండి 1609మంది హాజరు కాగా 494మంది ఉత్తీర్ణులయ్యారు. బీ ఎస్సీ నుంచి 5146మంది హాజరు కాగా 1732మంది ఉత్తీర్ణులయ్యారు. బీ కాం. కు చెందిన అభ్యర్థులు 2234మంది పరీక్షలు రాయగా 945మంది ఉత్తీర్ణతసాధించారు. బి బి ఎం నుంచి 92మంది హాజరు కాగా 89మంది పాసైయ్యారు, 9081మంది విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయగా 3,300మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు స్పష్టంచేశారు. వీసితోపాటు రిజిస్ట్రార్ జి.తులసీరావు, ప్రిన్సిపల్ పి.చిరంజీవులు, డీన్ టి.కామరాజు, అడ్డయ్య, పాలకమండలి సభ్యులు బరాటం లక్ష్మణరావు, ఎన్.జయరామ్, కె వి ఏ నాయుడు, ప్రిన్సిపల్ బాబూరావు, ఉమెన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మైథిలీలు ఉన్నారు.
టాపర్స్ వీరే:
ఈ పరీక్షల్లో బి ఏ నుండి ఏ.నాగమణి, జి.సౌజన్యకుమారి, పి.తేజేశ్వరిలు అత్యధిక పాయింట్లు సాధించి టాపర్లుగా నిలిచారు. బీ ఎస్సీ నుంచి ఎస్.కిరణ్మయి. ఎం.రోజ. పి.హారికాబాయిలు, బి బి ఎంనుండి ఏ.వర్షిక, కె.సునందిని, డి.నిలోత్పల , బి కాం.లో రాణికుమారిసింగ్, ఎం.శ్రీనివాస్, కె.చందనలు సత్తాచాటారు.
27 ఇన్‌స్టెంట్ పరీక్ష:
డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాల్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఇన్‌స్టెంట్ పరీక్ష ఈనెల 27న ఏర్పాటు చేసి విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపడుతున్నట్లు వర్శిటీ అధికారులు పేర్కొన్నారు. ఒకసబ్జెక్టు అయితే రూ.1000, రెండు పేపర్లయితే రూ.1500 రుసుము ఈనెల 25లోపు చెల్లించాలన్నారు.
పరీక్షా కేంద్రం అంబేద్కర్ విశ్వవిద్యాలయంగా నిర్ణయించామని ఉదయం10 గంటలనుండి 1:00గంటవరకు పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాత హాల్ టికెట్‌తో రుసుము చెల్లించిన అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు. ఇన్‌స్టెంట్ పరీక్షకు 721మంది అర్హులుగా గుర్తించామని వీరంతా సంబంధిత కళాశాలల్లో సమాచారాన్ని సంప్రదించాలని సూచించారు.