శ్రీకాకుళం

రోజువారీ నివేదికలు ఇస్తేనే ఉద్యోగం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 17: గృహానిర్మాణశాఖ ఇంజనీరింగ్ అధికారుల పనితీరు బాగాలేదంటూ కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం మండిపడ్డారు. ఎ.ఇ., డి.ఇ.లు రోజువారీ ప్రగతి నివేదికను తు.చ.తప్పకుండా పంపాలని అలా పంపని వారు సెలవుపై వెళ్ళిపోవచ్చునంటూ హుకుం జారీ చేశారు. ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లో గృహాలు నిర్మించడానికి స్థలాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఇంజనీర్లును ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో హౌసింగ్‌శాఖ ఇంజనీర్లతో ఆయన సమీక్షించారు. నివేదికలు ఇవ్వని ఇంజనీర్లకు మోమోను జారీ చేయాలని గృహనిర్మాంశాఖ పి.డి.ను ఆదేశించారు. పది సంవత్సరాల్లో మంజూరైన రెండు లక్షల 45 వేల గృహనిర్మాణాల పనుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేవించి 15 మాసాలు పూర్తిఅయినప్పటికీ అధికారుల్లో స్పందన కనిపించకపోవడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని వేసినట్టు తెలిపారు. మంజూరు చేసిన 2.45 లక్షల గృహాల్లో పూర్తయిన, పూర్తికాని గృహాల వివరాలతోపాటు ఇంతవరకు ఎంత మొత్తం చెల్లించారో వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. సమగ్ర నివేదిక సమర్పించనింతవరకూ జీతాలు నిలుపుదల చేయాలని పి.డి.ని సూచించారు. ఆరు సంవత్సరాలు పైబడి ఉన్న ఎ.ఇ.లు, డి.ఇ.లును బదిలీచేయాలని చెప్పారు. గ్రేడింగ్ అయి పూర్తికాని గృహాల టేడాను తయారుచేయాలని, అవి ఎస్సీ, ఎస్టీలకు సంబందించినవి అయితే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. పి.ఎం.ఏ.వై.పథకం కింద గృహాలు కావల్సిన వారు వివరాలు ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాలని చెప్పారు. ఈ గృహాలకు 1.50 లక్షల సబ్సిడీ లేదా 6.5 శాతం వడ్డీతో కేంద్రప్రభుత్వం మంజూరుచేస్తుందని తెలిపారు. గ్రామీణ ఆవాస యోజన పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కొరుకు 1.30 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. హుదూద్ తుపానుకు మంజూరైన గృహాల నిర్మాణం కోసం గుర్తించబడిన భూమిని వెంటనే తహశీల్దార్లు అప్పగించాలని ఫోన్‌ద్వారా ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన సీతంపేట ఎ.ఇ.ని సస్పెండ్ చేయాలని పిడిను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్వో కృష్ణ్భారతి, హౌసింగ్ పి.డి.నర్సింగరావు, జెడ్పీ సీఈవో నగేష్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.