శ్రీకాకుళం

టీడీపీ పాలనలో అంతా అవినీతి మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 19: తెలుగుదేశం పార్టీ పాలన అంతా అవినీతిమయమని, జన్మభూమి కమిటీలు పేరుతో ప్రజలను విభజించి పాలించడం జరుగుతుందని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. బుధవారం మండలంలోని కొండాపురం గ్రామంలో కావాలి జగన్... రావాలి జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి ఇంటికి నవరత్నాలు పథకాలు ద్వారా సంక్షేమాన్ని చేరవేయడమే తమ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. వైకపా నాయకులు పాలవలస రాజశేఖరం, విక్రాంత్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే మనందరం కలిసికట్టుగా నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ పాలకొండ నియోజకవర్గంలో గెలవలేదని తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థానాన్ని పొత్తులో భాగంగా అంటగడుతున్నట్టు ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ పరిస్థితిని గమనించాలన్నారు. వైకాపాకు ఓటు వేసి ఇటువంటి పరిస్థితుల్లో కళావతిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కనపాక సూర్యప్రకాశరావు, కడగల రమణ, వెలమల మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.

ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 19: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటి ఓటుతో సుపరిపాలన కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నగర పంచాయతీ కమిషనర్ నూకేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కుపై నినాదాలు చేశారు. 18 ఏళ్లు నిండిన యువకులంతా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకొని మంచి రాజకీయ పార్టీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ గరికివాడు, ఎంపీడీవో ఆర్.తిరుపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

పరికరాల పంపిణీ
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 19: నెక్ ద్వారా శిక్షణ పొందిన కార్మికులకు స్థానిక కార్మికశాఖ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వం అందించిన కిట్లును పంపిణీ చేశారు. గత నెల 28వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ వీటిని అందించారు. మిగతా వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత పంపిణీ చేయనున్నట్టు ఏ ఐటీయూసీ గౌరవాధ్యక్షులు బుడితి అప్పలనాయుడు వివరించారు. గతంలో కిట్లు కోసం లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేయడంతో వాస్తవమైన లబ్ధిదారులకు ఇవి చేరినట్టు ఆయన వెల్లడించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
పలాస, సెప్టెంబర్ 19: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని జడ్‌పీ సీ ఇవో నగేష్ అన్నారు. బుధవారం కాశీబుగ్గలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కాశీబుగ్గ నుంచి ర్యాలీగా బయలుదేరి శ్రీనివాసలాడ్జికు చేరుకొని తిరిగి కాశీబుగ్గ బస్టాండ్‌కు చేరుకొని మానవహారం నిర్వహించి తహసీల్థార్ కార్యాలయం వద్ద బీ ఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదుకావడం మనందరి బాధ్యత అని, యువత ఓటర్లుగా నమోదు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడం మన బాధ్యత అని, ఓటర్లు నమోదుకు చదువుకు సంబంధం లేదని, ఈ నెల 30వ తేది వరకు బీ ఎల్‌వోల దగ్గర దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించుకోవాలన్నారు. అక్టోబర్ 31వ తేదిలోగా నేషనల్ ఓటర్సుసర్వీసు పోర్టర్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫారమ్‌లను సమర్పించుకోవచ్చునన్నారు. బీ ఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్లును నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్థార్లు కల్యాణచక్రవర్తి, రమణయ్య, శ్యామసుందరరావు, ఎంపీడీవో సూర్యనారాయణరెడ్డి, ఆర్ ఐలు, వి ఆర్‌వోలు పాల్గొన్నారు.

రాష్ట్రానికి పాలించే సత్తా చంద్రబాబుకే ఉంది
పాలకొండ (టౌన్), సెప్టెంబర్ 19: ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సంక్షేమంగా పాలించే సత్తా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని ఎల్. ఎల్.పురం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని లాభాల బాటలో నడిపించి యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగభృతి, పింఛన్లు, అన్న క్యాంటీన్ వంటి పథకాలు నిర్వహణ మరెవరికీ సాధ్యం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీకి ఓటువేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.