శ్రీకాకుళం

శ్రీముఖలింగం తాగునీరు ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలుమూరు, సెప్టెంబర్ 19: మండలం అత్యుతాపురం గ్రామంలో రూ.28కోట్లతో నిర్మిస్తున్న శ్రీముఖలింగం తాగునీటి ప్రాజెక్ట్ పనులను బుధవారం గ్రామీణ రక్షిత నీటి శాఖా విభాగం ఎస్ ఈ టి.శ్రీనివాసరావు అత్యుతాపురం వద్ద పరిశీలించారు. జలుమూరు, సారవకోట మండల పరిథిలో 92గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కృషి మేరకు మంజూరయిందన్నారు. ప్రాజెక్ట్ పరిథిలో మొదటి విడత 92 గ్రామాల్లో జనవరి మొదటి వారంలో జలుమూరు మండల పరిథి పది గ్రామాలకు తాగునీరు అందస్తామని ఎస్ ఈ తెలిపారు. ఇదే దిశగా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఫిబ్రవరి చివరినాటికి ప్రాజెక్ట్ మొదటి విడతలో ఉన్న 37 గ్రామాలకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. పంప్‌హౌస్ నిర్మాణం పనులు శరవేగంతో జరుగుతున్నాయని, రెండో విడతలో ఉన్న 55 గ్రామాల నీటి పథకం ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అదనంగా నాబార్డ్‌నుండి మరో రూ.20 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసిందని, దీనితో మరింత అభివృద్ధి జరుగుతుందని ఎస్ ఈ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సారవకోట, జలుమూరు మండలాల ప్రజానీకానికి ఎన్నో దశాబ్ధాలుగా కలలు కన్న తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. ఆయనతో పాటు డి ఈ పి.చంద్రకిరణ్, ఏ ఈ ఎమ్.నాగభూషన్, పలువురు పాల్గొన్నారు.

పెద్దదూగాం వైద్య పరీక్షల్లో బయటపడ్డ కీళ్లునొప్పులు
డాక్టర్ పవన్‌కుమార్
జలుమూరు, సెప్టెంబర్ 19: మండలం పెద్దదూగాం గ్రామంలో బుధవారం జలుమూరు ప్రాథమిక వైద్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన వైద్య పరీక్షల్లో ప్రతీ వ్యక్తికి ముడుకులు నొప్పులు, కీళ్లు నొప్పులు బయడపడ్డాయని వైద్యాధికారి సూరపు పవన్‌కుమార్ తెలిపారు. 32 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా అందరికి కీళ్లనొప్పులు, ముడుకుల నొప్పులు ఉన్నట్లు ధృవీకరించబడ్డాయి. ఈవ్యాధితో పాటు బీపీ, సుగర్‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీరందరికి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు చేపడతామని స్పష్టం చేశారు. ఇంతమందికి ఈ వ్యాధి ఉండటంతో ఆయన బాధాకరం వ్యక్తపరిచారు. ఆయనతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటరావు, పర్యవేక్షణాధికారి చిన్నరాజులు, స్థానిక ఆరోగ్యకార్యకర్త ఎమ్.్భరతి పాల్గొన్నారు.

పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక
* ఎంపీడీవో వాసుదేవరావు
జలుమూరు, సెప్టంబర్ 19: 2019-20 సంవత్సరానికి గాను ప్రతీ గ్రామ పంచాయతీలో చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రతీ పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని ఎంపీడీవో పడాల వాసుదేవరావు అన్నారు. మండల ప్రజాపరిషత్ సమావేశం మందిరంలో బుధవారం జరిగిన మండల స్థాయి ప్రత్యేక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమగు వౌళిక సదుపాయాలు కల్గించే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎటువంటి రాజకీయాలకు తలొగ్గకుండా అన్ని వర్గాల ప్రజల అభిమానం మేరకు ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. సమావేశంలో పంచాయతి విస్తరణాధికారి కొమరాపు అప్పలనాయుడు మాట్లాడుతూ పంచాయతీ పరిథిలోపాలక వర్గం లేనందున కార్యదర్శి బాధ్యతగా పంచాయతీ ప్రత్యేక అధికారి సూచనలు, సలహాలతో పారిశుద్ధ్య పనులను చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. వీటితో పాటు పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.

ఈదురు గాలులు...భారీ వర్షం
జలుమూరు, సెప్టెంబర్ 19: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమో, వర్షాకాలమో తెలియదు కాని బుధవారం మధ్యాహ్నం వీదురు గాలులు, భారీ వర్షం కురిసింది. మండలం చల్లవానిపేట జోనంకి, పలు గ్రామాల్లో అకాలంగా వర్షం కురియడం ఇటు రైతులు, అటు ప్రజలు సంతృప్తి వ్యక్తపరిచారు. గత మూడు రోజులుగా వర్షం లేక ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణం అనుకూలించడం సంబరపడ్డారు. రైతులు వర్షం కోసం వినాయచవితినుండి ఎదురు చూస్తుండగా ఆకస్మికంగా కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తపరిచారు. కొన్ని ప్రాంతాలలో గాలులకు మొక్కలు వంగిపోగా మరికొన్ని ప్రాంతాలలో రహదారులు లేని వీధులు నీటితో బురదమయమయ్యాయి.

సంక్రాంతి నాటికి స్వచ్ఛమైన నీరందిస్తాం
* ఎస్ ఈ శ్రీనివాసరావు
సారవకోట, సెప్టెంబర్ 19: నాబార్డ్ నిధుల నుండి చేపట్టిన మెగా రక్షిత మంచినీటి పథకం నిర్మాణం జనవరి నాటికి పూర్తిచేసి సంక్రాంతికి అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఈ విభాగం పర్యవేక్షక ఇంజనీర్ టి.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మండలం పరిథిలోని కినె్నరవాడ గ్రామం వద్ద వంశధార కాల్వ గట్టుపై పైప్‌లైన్ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి 22 గ్రామాల పరిథిలో నూతనంగా వాటర్ హెడ్ ట్యాంక్‌లను నిర్మిస్తామన్నారు. 15 గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంక్‌లకు బుడితి జంక్షన్‌లో నిర్మిస్తున్న మెగా ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. రెండు మండలాల పరిథిలో మొదటి విడతలో 37 గ్రామాలకు తాగునీరు అందిస్తామని వివరించారు. కొమనాపల్లి వద్ద వంశధార నది తీరంలో నిర్మించిన ట్యాంక్ ద్వారా బుడితి జంక్షన్‌లో నిర్మించిన ట్యాంక్‌కు, అదేవిధంగా అలుదులో నిర్మించనున్న మెగా ట్యాంక్‌కు పంపింగ్ ద్వారా తొలుత నీరందిస్తామని, అక్కడనుండి గ్రావిటీ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయడానికి ప్రణాళిక సద్ధం చేశామని తెలిపారు. పథకం నిర్మాణంలో శతశాతం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని, భవిష్యత్‌లో పైప్‌లైన్‌లు మరమ్మత్తులకు గురికాకుండి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ఇదిలా వుండగా రెండోదశ నిర్మాణానికి 55 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.20కోట్లు మంజూరయినట్లు ఆయన వివరించారు. ఈయనతో పాటు డి ఈ చంద్రశేఖర్, ఏ ఈ నాగభూషణరావు, కాంట్రాక్ట్ ప్రతినిధుల పాల్గొన్నారు.