శ్రీకాకుళం

ఏవోబీలో హై అలర్ట్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.శ్రీకాకుళం, సెప్టెంబర్ 23: చాలా కాలంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మావోల కదలికలే లేవంటూ రాష్ట్ర పోలీసు బాస్ నుంచి విశాఖ రేంజ్ అధికారి, జిల్లా ఎస్పీలు చెప్పుకువస్తునే ఉన్నారు. ఒక్కసారిగా 50 మంది మావోయిస్టులు అరుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై దాడి చేసి కాల్పులు జరిపి వారి ప్రాణాలు తీసి, ప్రభుత్వానికి, పోలీసులకు, ప్రజాత్రినిధులకు తమ ఉనికి గట్టిగానే ఉందని ఈ సంఘటన ద్వారా చెప్పకనే చెప్పారు. ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్ 15 మంది మావోయిస్టులు మృతి..అంతకుముందు బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి..ఇటువంటి సంఘటనల నడుమ వరుస ఎన్‌కౌంటర్లతో తీవ్రంగా నష్టపోయిన తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన మరిన సమయం..తాజా ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన కొద్ది రోజుల్లోనే మావోల మరణమృందంగానికి ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేస్తునే ఉన్నారు. భద్రతా బలగాలు అప్రత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్న కొద్ది గంటల్లోనే ఆదివారం అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే, ఈ మావోల దాడిపై ప్రతీకార చర్యలు కావని, బాక్సైట్ వివాదమే ప్రధాన కారణమని పోలీసులు, అధికారులు చెప్పకనే చెబుతున్నారు. దీంతో ఏవోబీలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు బేస్ క్యాంపులు నిర్వహించి, ఆపరేషన్స్ ప్రారంభించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమవర్మకు ఆదేశాలు అందినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో మావోల సేఫ్‌జోన్స్‌లు గుర్తించి తువ్వాకొండలు, మహేంద్రగిరి కొండల్లో కూంబింగ్ బలగాలు ముమ్మరంగా గాలింపులు నిర్వహించేందుకు రంగంలోకి దిగాయి. జిల్లాకు ఆనుకుని కోరాపుట్ వద్ద మందుపాత్ర పేల్చి ప్రభుత్వ బస్సును టార్గెట్ చేసిన మావోలు ఇటీవలే సుంకిఘాట్ వద్ద సీఆర్‌ఫిఎఫ్ వ్యాన్, మోటారు సైకిళ్ళను తగలబెట్టారు. ఎంతోకాలంగా స్థబ్ధంగా ఉన్న మావోలు ఇటీవల మంత్రి అచ్చెన్న కదలికలపై రెక్కీ నిర్వహించినా దానిని కొట్టిపారేసిన పోలీసులు, అవన్నీ పుకార్లుగా పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆయన సెక్యూరిటీని ప్రభుత్వం పెంచింది. ఆదివారం విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోలు కాల్పులు జరిగిన సంఘటన అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజాప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర పోలీసు బాస్ నుంచి సమాచారం అందింది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సెక్యూరిటీని మరింత పెంచడం జరిగింది. పోలీసుల అనుమతి లేకుండా మంత్రి అచ్చెన్న గ్రామదర్శిని, ఇతర ప్రారంభోత్సవాలు, సమీక్షలు, సమావేశాలు వంటి పర్యటనలు చేయరాదంటూ ఇంటెలిజెన్స్ అధికారులు సూచనలు ఇచ్చారు. అసలు మావోలు ఉనికే లేదని పోలీసులు చెప్పుకొస్తున్న తరుణంలో మావోయిస్టులు ఇంత భారీ సంఖ్యలో దాడికి దిగడం..పైగా ఒకే ఘటనలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను సునాయాసంగా మట్టుబెట్టడంతో శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలో పోలీసుబలగాలను కొండలపైకి పంపింది. అడపతడపగా జరిగే కూంబింగ్ ఇప్పుడు బేస్ క్యాంపులు, ఆపరేషన్స్ వరకూ వెళ్ళింది. శ్రీకాకుళం జిల్లాకు ఆనుకుని ఉన్న తూర్పుకనుములు వారికి సేఫ్‌జోన్ కావడంతో గజపతి, రాయపూర్, మోహన, కోరాపుట్‌లతోపాటు జిల్లాలో మావోల సభలు, సమీక్షలు, వారోత్సవాలకు నెలవైన తువ్వాకొండలు, మహేంద్రగిరులపై పోలీసు బిగ్‌బాసులు కూంబింగ్ బృందాలను పంపారు. ఆంధ్ర, ఒడిషా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించడంతో ఎక్కడా ఏ ప్రజాప్రతినిధి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పర్యటనలకు వెళ్ళవద్దని, ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరించారు. మావోయిస్టుల ముప్పు ఉంటుందని భావిస్తున్న అచ్చెన్నకు భద్రతను పెంచేశారు. పోలీసు విభాగాలకు అత్యవసర హెచ్చరికలు, తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ఆదేశాలు జారీ చేసారు.