శ్రీకాకుళం

టీడీపీతోనే సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 14: టీడీపీ హయాంలోనే సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలన అందించడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో 8వ డివిజన్ పరిథిలో బాయమ్మతోటలో డివిజన్ ఇన్‌ఛార్జ్ జాక శాం ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ పార్టీ నగర వికాశ్ దర్శిని కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల్లో సమస్యలను తెలుసుకునేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నగరదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మహిళల కోసం ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదిశగా వాటిని అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంతి నారాచంద్రబాబునాయుడు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లాలోనే మూడు రోజులపాటు ముఖ్యమంత్రి దగ్గరుండి సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వెంకటేశ్, వార్డు ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

ముగిసిన అంతర్ కళాశాలల క్రీడా పోటీలు
శ్రీకాకుళం(రూరల్), అక్టోబర్ 14: మండలంలోని నైర వ్యవసాయ కళాశాలల్లో ఈనెల 12వ తేదీనుండి నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ఆదివారంతో ముగిసాయి. ఆదివారం జరిగిన బాస్కెట్ బాల్ ఫైనల్ పోటీల్లో వ్యవసాయకళాశాల తిరుపతి విద్యార్థులు విజేతలు కాగా వ్యవసాయ కళాశాల బాపట్ల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ ఆటల పోటీల్లో విజేతలకు ముగింపు ఉత్సవం సందర్భంగా బహుమతులు అందజేశారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విధ్యాలయం బోర్డ్ మెంబర్, డి ఎస్ ఎ డాక్టర్ ఎస్ ఆర్ కోటీశ్వరరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ పి.వి కృష్ణయ్య, డాక్టర్ ఎ.ప్రతాపరెడ్డి, విజేతలు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

పంటల నష్టాల అంచనా
వీరఘట్టం, అక్టోబర్ 14: ఇటీవల తిత్లీ తుపాను కారణంగా జరిగిన పంట నష్టాలను ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, హార్టీకల్చర్ శ్రీదేవి ఆదివారం మండలంలోని కంబరవలస, చిట్టిపుడివలస, విక్రంపురం గ్రామాల్లో పర్యటించి నేలకొరిగిన అరటి పంటలను పరిశీలించి అంచనాలను తయారు చేస్తున్నామన్నారు. అంచనాలను తయారు చేసిన జాబితాను జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని వారన్నారు. పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంటలను కూడా ఫోటోలతో పంపిస్తున్నామన్నారు. రహదారులు గండ్లు పడినవి పూర్తిగా పనులు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.