శ్రీకాకుళం

ఆన్‌లైన్‌లో డీ ఎస్సీని నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, నవంబర్ 13: 2018 డి ఎస్సీని ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, వివిధ సమయాల్లో వేర్వేరు పత్రాలతో నిర్వహించడం వల్ల అందరికి సమయానికి జరగడం లేదని, ఇందుకు గాను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు చందనరావు డిమాండ్ చేసారు. మంగళవారం కాశీబుగ్గలో విలేఖరులతో మాట్లాడారు. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయుల సంఖ్య డి ఎస్సీ ఆశావాహుల్లో నిరాశ, నిస్హృహలు అలుముకున్నాయని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23 వేల పోస్టులను భర్తీ చేసేందుకు పునఃసమీక్షించాలని కోరారు.

కార్మికుల అభివృద్ధికి సహకారం
పలాస, నవంబర్ 13: పలాస మున్సిపాలిటీలో తమ వంతు సహకారం ఉంటుందని పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు అన్నారు. మంగళవారం పురపాలక సంఘం భవనంలో మున్సిపల్ కార్మికులకు భద్రతవస్తువులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ద్య కార్మికులకు ప్రభుత్వపరంగా అందాల్సిన భద్రత వస్తువులు క్రమం తప్పకుండా అందిస్తున్నామన్నారు. కార్మికులకు హెడ్‌గ్లోస్‌లు, చెప్పులతో ఇతర వస్తువులను అందించడం జరిగిందన్నారు. పలాస మున్సిపాలిటీని స్వచ్ఛమున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత పారిశుద్ద్య కార్మికులపై ఉందని, విధి నిర్వహణలో ఆలసత్వం వహించకుండా తమకు అప్పగించిన పనులను చిత్తశుద్దితో పనిచేస్తే పారిశుద్ద్యం నిర్వహణ సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్‌నాయుడు, కౌన్సిలర్లు ఎస్.మోహనరావు, శ్రీనివాసరావు, పద్మనాభం, మహేష్, శ్రీను, పారిశుద్ద్యకార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సీపీ ఎం సీనియర్ నేత రోహిణమ్మ మృతి
సోంపేట, నవంబర్ 13: సోంపేట మండలం, మామిడిపల్లి గ్రామానికి చెందిన సీపీ ఎం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీటీసీ సభ్యులు పి.రోహిణమ్మ(65) మంగళవారం వేకువజామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈమె భర్త రిటైర్డు ఉపాధ్యాయులు కృష్ణమూర్తి సీపీ ఎం పార్టీ డివిజన్ కార్యదర్శిగా అనేక దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందించారు. సీపీ ఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా ప్రతినిధి మోహనరావు, వ్యవసాయసంఘం రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, జడ్‌పిటీసీ చంద్రమోహన్ సానుభూతిని వ్యక్తం చేసారు.

4 వేల లీటర్లు బెల్లం ఊటలు ధ్వంసం
సోంపేట, నవంబర్ 13: ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆదేశాలు మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, సోంపేట, పలాస, ఇచ్ఛాపురం మొబైల్‌పార్టీలు గత రెండు రోజులుగా చేస్తున్న దాడుల్లో చాపరాయి గ్రామపరిసర ప్రాంతాల్లో నాటుసారాను తయారుచేసేందుకు నిల్వ ఉంచిన 3 వేల లీటర్లు పులిసిన బెల్లాన్ని ధ్వంసం చేయగా, మందస మండల పరిధిలో కొండలోగాం గ్రామంలో జరిపిన దాడుల్లో 300 లీటర్లు పులిసిన బెల్లం, టప గ్రామంలో 700 లీటర్లు పులిసిన బెల్లం ధ్వంసం చేసినట్లు సోంపేట ఎక్సైజ్ సీ ఐ అబ్దుల్‌కరీం తెలిపారు. జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, బీ ఎంపిపి-3,4 సిబ్బంది పాల్గొన్నారు.